మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది. ‘చిరంజీవికి వరుసకు నేను తాతను అవుతాను’ అని కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు దాసరి. చిరీంజవికి కూడా దాసరి అంటే అంతే గౌరవం ఉండేది. తొంభైల్లో చిరంజీవి సినిమా 100 రోజుల ఫంక్షన్ ఉందంటే దానికి దాసరే ముఖ్య అతిధిగా ఉండేవారు. అలాంటి వారిద్దరి అనుబంధంలో కొన్నేళ్లు మనస్పర్ధలు వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చిరంజీవి రాజకీయ ప్రవేశం వల్ల ఇటువంటి గ్యాప్ ఎక్కువగా వచ్చిందని ఓ టాక్ ఉంది.

IHG

 

దీనికి వీరిద్దరూ వేర్వేరు సందర్భాల్లో వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో ఉండటం చిరంజీవి వేరే పార్టీ పెట్టడం వల్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చిందని దాసరి చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యంకు వ్యతిరేకంగా మేస్త్రి సినిమా తీశాననే వార్తల్లో నిజం లేదన్నారు కూడా. కానీ సినిమాలో చిరంజీవికి వ్యతిరేకంగా అనేక సీన్లు ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. రామ్ చరణ్ మగధీర విషయంలో నంది అవార్డుల ప్రధానంపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. దీనికి ఆరెంజ్ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి కూడా.. అవార్డులు అవసరం లేదు.. ప్రేక్షకాభిమానం చాలు అని అన్నారు.

IHG

 

చిరంజీవి కూడా.. తాను రాజకీయాల్లోకి వెళ్లే ముందు దాసరిని కలవ లేదు. ఆ కారణంగా నాపై కొంత మనస్పర్ధ వచ్చి ఉండొచ్చు... అని అన్నట్టు వార్తలు వచ్చాయి. కాలగమనంలో ఇవన్నీ సమసిపోయి దాసరి 2017లో చిరంజీవి ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లి ఆశీర్వదించారు. దాసరి హాస్పిటల్ లో ఉండగా చిరంజీవి వెళ్లి కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. అల్లు రామలింగయ్య అవార్డు కూడా ఇచ్చారు. చివరగా వీరిద్దరూ ఒకటవటం మాత్రం మెగా అభిమానులకు సినీ ప్రియులకు సంతోషం కలిగించిందనే చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: