మహానటితో కీర్తి సురేష్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయ ఉత్తమ నటి అనిపించుకుంది. మహానటితో వచ్చిన రెస్పాన్స్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. నటిగా తనేమిటో మిరంత నిరూపించుకోవాలనుకుంది. అయితే..కరోనా ఈ అమ్మడి లక్ష్యానికి బ్రేకులేస్తోంది. ఆమె ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. 

 

హీరో ఓరియెంటెడ్ సిినిమాల్లో హీరోయిన్ టాలెంట్ బయటపడటం కష్టం. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించేందుకు కావాల్సినంత దొరుకుతుంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి కీర్తిసురేష్ కు ఓ మంచి నటి అనే ఇమేజ్ తీసుకొచ్చింది.

 

మహానటి సక్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో పెంగ్విన్, మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది కీర్తి. మిస్ ఇండియా.. షూటింగ్ ఆల్ రెడీ పూర్తి చేసుకుంటే.. రిలీజ్ ను కరోనా అడ్డుకుంది. మారిన పరిస్థితులతో నిర్మాతలు ఓటీటీటీ వైపు చూస్తున్నారు. పెంగ్విన్ డిజిటల్ రిలీజ్ కు మంచి ఆఫర్ రావడంతో అమేజాన్ ప్రైమ్ కు సినిమా రైట్స్ ఇచ్చేశారు. జూన్ 19న డైరెక్ట్ గా రిలీజ్ అవుతోంది. 

 

పెంగ్విన్ బాటలోనే కీర్తి సురేష్ మరో సినిమా నడుస్తోంది. కీర్తి మెయిన్ లీడ్ లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ లక్ సఖి కూడా.. డిజిటల్ వైపు చూస్తోందట. అలాగే.. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన మిస్ ఇండియా కూడా డిజిటల్ లోకి వచ్చే అవకాశముంది. ముందుగా జూన్ 19న ఓటీటీలో రిలీజ్ అవుతున్న పెంగ్విన్ రిజల్ట్ చూసి.. నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. 

 

పెంగ్విన్ సక్సెస్ పై .. కీర్తి సురేష్ నటించిన మరో రెండు సినిమాల డెసిషన్ ఆధారపడి ఉంది. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖిని ఓటీటీలో రిలీజ్ చేయాలా.. వద్దా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: