తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15 నుండి తిరిగి షూటింగ్ లు ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇవ్వబోతోంది అన్న విషయమై స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దీనితో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు దర్శకులు తమ సినిమాల షెడ్యూల్స్ ను ఫైనల్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఆ సినిమాలలోని కీలక నటీనటుల డేట్స్ గురించి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే రామ్ చరణ్ పాత్ర గురించి సస్పెన్స్ లో పడిపోయిన ‘ఆచార్య’ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించి చాలవేగంగా పూర్తి చేయడానికి ఇప్పుడు అలియా భట్ సమస్యగా మారింది అన్న గాసిప్పులు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ లో కీలక పాత్రను పోషిస్తున్న అలియా భట్ తన డేట్స్ ను ఒకేసారి ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ కు ఇవ్వలేనని తాను నటిస్తున్న మిగతా సినిమాలకు ఎడ్జెస్ట్ చేసుకుంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ కు కూడ తాను రాబోయే నెలలలో డేట్స్ ను ఇస్తాను కాని ఒకేసారి తన డేట్స్ ను ఇవ్వలేను అని అలియా భట్ సున్నితంగా రాజమౌళికి చెప్పినట్లు టాక్.


దీనితో రాజమౌళి రామ్ చరణ్ అలియా భట్ ల కాంబినేషన్ సీన్స్ షూటింగ్ పూర్తి అయ్యేవరకు తాను చరణ్ ను ‘ఆచార్య’ వైపు పంపలేనని కొరటాలకు స్పష్టం చేసినట్లుగా గాసిప్పులు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు ‘ఆచార్య’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుని కనీసం వచ్చే సంక్రాంతికి అయినా విడుదల అవ్వాలి అంటే అది అలియా భట్ సహకారం మీద ఆధారపడి ఉంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.


దీనితో జరుగుతున్న పరిణామాలు చూసి కొరటాల విపరీతంగా టెన్షన్ లోకి వెళ్ళిపోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా గురించి తన విలువైన రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకున్న పరిస్థితులలో ఇంకా ఈ సినిమా కోసం ఎంతకాలం తన కాలాన్ని అదేవిధంగా తనకు వస్తున్న అవకాశాలను వదులుకోవాలో అర్థంకాక తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: