మన తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు వివాదాలతో కూడా ఎక్కువగానే సావాసం చేసారు. వివాదాలు లేకుండా వాళ్ళు ఎప్పుడు లేరు అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే వారు కొందరు ఉంటారు. టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. హీరోయిన్ గా అయినా మరొకరకంగా అయినా సరే ఆమె తెచ్చుకున్న పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఆమె మాత్రం ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండే వారు. భర్త బోని కపూర్ విషయంలో ఆమె ఎప్పుడు కూడా ఏదోక వివాదాన్ని మోస్తు వచ్చారు. 

 

ఆయనను పెళ్లి చేసుకోవడమే ఒక వివాదం అయితే ఆ వివాహం విషయంలో ఆమె తర్వాత తర్వాత పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు అనే చెప్పాలి. ఆమెను బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ బాగా ఇబ్బంది పెట్టారు అని అంటూ ఉంటారు. ఆయన కారణంగా ఆమె  చాలా ఇబ్బందులు పడింది అనేది టాలీవుడ్ జనాల మాట. బాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ అయినా సరే చాలా సందర్భాల్లో ఆమెను అతను అవమానించారు అని తన తల్లిని పక్కన పెట్టి శ్రీదేవి ని ఆయన వివాహం చేసుకోవడం అసలు అర్జున్ కి నచ్చలేదు అని అంటారు. 

 

ఆ తర్వాత అర్జున్ ని కలుపుకోవడానికి శ్రీదేవి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ విషయంలో చాలా సార్లు ఆమె భర్త వద్ద బాధ పడినా సరే ఉపయోగం లేదు అని అంటారు. ఆమె టాలీవుడ్ లో ఎవరికి అందని రేంజ్ లో ఉన్న సమయంలో కూడా అక్కడ వివాదాలతో ఆమె సావాసం చేసారు. అది ఆమె అభిమానులను చాలా బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: