టాలీవుడ్ లోమోహన్ బాబు కి ఉన్న పేరు గాని ఆయన తెచ్చుకున్న ఇమేజ్ గాని అంత తక్కువ కాలంలో ఎవరూ కూడా తెచ్చుకోలేదు అనేది వాస్తవం. ఆయన విలన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు ఆయనకు కొన్ని విధాలుగా చాలా వరకు ప్లస్ అయ్యాయి. అయితే ఆయనకు కొందరి తో ఉన్న వివాదాలు మాత్రం అప్పట్లో ఒక సంచలనం. ముఖ్యంగా చిరంజీవి కి ఆయనకు ఎప్పుడు దూరం ఉంది. మోహన్ బాబు కి చిరంజీవి ఆధిపత్య౦ ఏ మాత్రం కూడా నచ్చేది కాదని అందుకే చిరంజీవి తో ఆయన దూరం పెంచుకున్నారు అని టాలీవుడ్ జనాలు అంటారు. కాని అది నిజం కాదు అనేది చాలా మంది చెప్పే మాట. 

 

మోహన్ బాబు అనవసరంగా ఎక్కువగా ఊహించుకునే వ్యక్తి అని అనవసరంగా ఆవేశ పడుతూ ఉంటారు అని అదే ఆయనకు బాగా ఇబ్బందిని తీసుకొచ్చింది అనేది కొందరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇక చిరంజీవి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన తో సామరస్యంగా వెళ్ళినా సరే చిరంజీవి ని ఉద్దేశించి ఆయన ఏదోక సందర్భంలో ఏదోక వ్యాఖ్య చేయడం దాని పై చిరంజీవి కి కాస్త ఇబ్బంది గా ఉండటం తో మోహన్ బాబు మీద ఆయన కూడా కోపం పెంచుకున్నారు అని అంటారు. ఏది ఎలా ఉన్నా సరే వీరి మధ్య విభేదాలు మాత్రం అప్పట్లో ఒక సంచలనం. 

 

ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసినా సరే అది కేవలం  మీడియా ముందు సన్నిహితం మాత్రమే అని వాళ్ళ మధ్య అంత సీన్ లేదు అని అంటున్నారు.  ఇటీవల మా మీటింగ్ లో కూడా చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: