మన తెలుగులో ఎన్టీఆర్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన హీరోలు ఇద్దరూ కూడా. వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళు నమోదు చేసిన ఘనతలు ఎవరూ కూడా అందుకునే అవకాశం కూడా లేదు అనే చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు ఎన్నో సంచలనాలు సృష్టించారు అప్పట్లో అనేది వాస్తవం. అయితే వాళ్ళు ఇద్దరూ కూడా ఒకానొక సమయంలో తీవ్రంగా గొడవలు పడ్డారు అనేది చాలా మంది చెప్పే మాట. నిజం ఎంత ఉన్నా సరే దీనికి సంబంధించిన ప్రచారం మాత్రం అప్పట్లో బాగా జరిగింది 

 

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ రాజకీయాలు కూడా చేసారు అని కొందరు చెప్తారు. అది నిజం అయినా కాకపోయినా సరే మీడియా సంస్థలు మాత్రం దానికి అప్పట్లో చాలా వరకు హైప్ ఇచ్చాయి కూడా. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా దీని గురించి పెద్ద చర్చలే జరుగుతూ ఉంటాయి. ఇక వీరు ఇద్దరికీ ఒక సినిమా విషయంలో గొడవ వచ్చింది. సినిమా చేద్దాం అనుకుని కూడా వాళ్ళు విడిపోయారు అని అంటూ ఉంటారు. రాజకీయంగా ఎన్టీఆర్ ఎంతో ఎత్తులో ఉండటం కృష్ణ కు నచ్చలేదు అని మరికొందరు చెప్తారు. కాని అందులో వాస్తవాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. 

 

వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చినవి కేవలం అభిప్రాయ భేదాలే గాని ప్రచారాలు చేసిన స్థాయిలో వారి మధ్య ఏమీ లేదు అని అంటారు. ఎన్టీఆర్ ని చూసి కృష్ణ సినిమాల్లోకి వచ్చారు అని అనవసరంగా కొందరు తమ ఊహలతో ప్రచారం చేసుకుని వాళ్ళ మధ్య గ్యాప్ పెంచారు అని అప్పుడు మీడియా కూడా దీనిపై అతి ఎక్కువగా చేసింది అని అంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా సరే ఇది మాత్రం ఒక సంచలనం అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: