టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు గతంలో మంచి ఆదరణ ఉండేది. ఇప్పటికి కూడా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా బాగుంటుంది అనుకుంటే కచ్చితంగా ఆదరిస్తారు. ఆ సినిమాను చూడటానికి అన్ని విధాలుగా ఆలోచన చేసి అడుగు పెడుతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే అప్పుడెప్పుడో క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీ కాంత్ నుంచి ఆ త‌ర్వాత కార్తీ, సూర్య‌, విక్ర‌మ్, విజ‌య్‌, విశాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు త‌మ సినిమాల‌ను తెలుగులో కూడా రిలీజ్ చేసి హిట్లు కొడుతున్నారు.

 

ఇప్పుడు  మాత్రం డబ్బింగ్ సినిమాల విషయంలో మ‌నోళ్లు ఆలోచన చెయ్యాలని చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాలను పక్కన పెట్టడమే మంచిది అనే భావన లో ఉన్నారని సమాచారం. డబ్బింగ్ సినిమాలు ఫ్లాప్ అయితే ఆరిపోతామని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు అసలే నష్టాల్లో ఉన్నామని అనవసరంగా హక్కులను కొని తర్వాత తొందరపడి అవి స‌రిగా ఆడ‌క పోతే ఇబ్బంది పడాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఇప్పుడు డబ్బింగ్ సినిమాల విషయంలో ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నారు.

 

రజని కాంత్, సూర్య, కమల్ హాసన్, విజయ్ సినిమాలను కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించి ఓకే చెయ్యాలని భావిస్తున్నార‌ట‌. ర‌జ‌నీ, విక్ర‌మ్ లాంటి వాళ్ల సినిమాలు గ‌తంలో టాప్ రేట్ల‌కు కొని ఇక్క‌డ చాలా మంది బ‌ల‌య్యారు. అందుకే ఇప్పుడు త‌మిళ్ డ‌బ్బింగ్ హక్కులను కొనే సమయంలో  ఆ హీరో ట్రాక్ రికార్డ్ ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఎక్కువగా మన తెలుగులో తమిళ సినిమాలకే ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అక్కడి సినిమాలనే ఇక్కడ ఆదరిస్తూ ఉంటారు. ఈ లెక్కన ఎక్కువగా నష్టపోయేది తమిళ సినిమాలే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఏయే సినిమాలను కొంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: