టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన ఎందరో స్టార్ హీరోలకు నిర్మాతగా పని చేసారు. ఆయన సినిమాలు అన్నీ కూడా ఒకప్పుడు మంచి విజయాలు సాధించాయి. నిర్మాతగా ఆయన చేసిన సినిమాలు ఆయన  తో సమానంగా ఎవరూ కూడా చేయలేని విధంగా ఆయనకు పేరు వచ్చింది అప్పట్లో. అయితే ఆ తర్వాత ఆయన ప్రభ మసక బారింది అని అంటారు. ఇక ఆయన కెరీర్ లో కొన్ని కొన్ని వివాదాలు కూడా ఆయనను బాగా ఇబ్బంది పెట్టాయి అని అంటారు. ఆయనకు దాసరి కి మధ్య ఉన్న విభేదాలు అప్పట్లో సంచలనంగా మారాయి. 

 

దాసరి కెరీర్ లో చాలా సినిమాలు ఆయన తో కలిసి చేసారు. అయితే ఒక సినిమా కథ విషయంలో వీరి మధ్య విబేధాలు వచ్చాయి. ఎప్పుడు కథలను తెచ్చి దాసరి తమ్మారెడ్డి కి వినిపించే వారు. కాని అనూహ్యంగా మరొకరికి వినిపించడం తో ఆ తర్వాత తమ్మారెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను దాసరి మీద చేసారు. దీని తో దాసరి కూడా ఆయనను పక్కన పెట్టారు. అలా వారి మధ్య తీవ్ర స్థాయిలోనే గొడవలు అయ్యాయి అని అంటారు. కాని వాటిని సెటిల్ చేయడానికి కొందరు ప్రయత్నాలు చేసారు అని కాని అవి సెటిల్ అవ్వలేదు అని అంటారు. 

 

ఏది ఎలా ఉన్నా సరే ఆ  గొడవ మాత్రం తమ్మారెడ్డి కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టింది అని ఆ తర్వాత ఆయనను చాలా మంది పక్కన పెట్టారు అని అంటారు. ఇక దాసరి కెరీర్ లో ఆయనతోనే కాదు కొందరి తో కూడా దూరం పెంచుకున్నారు. ఆ తర్వాత అందరూ ఆయనకు దగ్గర అయినా సరే తమ్మారెడ్డి మాత్రం దగ్గర కాలేదు అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: