బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందం, అభినయం అంతకుమించి అదిరిపోయే లుక్స్ తో ప్రేక్షకులని మైమరిపించే కత్రినా కైఫ్జ్ మొదటిసారిగా సూపర్ హీరోయిన్ గా రాబోతుంది. భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ హీరోస్ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ మినహాయిస్తే అలాంటి సినిమాలేవీ ఎక్కువగా రాలేదు.

 

అయితే ప్రస్తుతం సూపర్ హీరోయిన్ గా కత్రినా కైఫ్ రాబోతుంది. సల్మాన్ ఖాన్‌తో ‘సుల్తాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అందరికీ సుపరిచితుడే. సుల్తాన్ సినిమాతో సల్మాన్ కి బ్లాక్ బస్టర్ అందించిన అబ్బాస్ పేరు మారుమోగిపోయింది. దాంతో మళ్ళీ సల్మాన్ తోనే భారత్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోయినా ఫర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ ఒక కొత్త ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు.

 


కత్రినా కైఫ్ హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కించబోతున్నాడు. అది కూడా సూపర్ హీరోయిన్ కథాంశంతో. ఇంతవరకూ ఏ హీరోయిన్ కూడా సూపర్ హీరోయిన్ గా కనిపించలేదు. హాలీవుడ్లో గాల్ గెడాట్ ప్రధాన పాత్రలో మూడేళ్ల కిందట వచ్చిన ‘వండర్ ఉమన్’ ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా రాబోతోంది త్వరలోనే. ఇండియాలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇదే స్టయిల్లో అలీ అబ్బాస్ జాఫర్.. కత్రినా ప్రధాన పాత్రలో సినిమా తీయబోతున్నాడు.

 


సుమారు 100కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.లేడీ ఓరియంటెడ్ చిత్రానికి అంత మొత్తంలో బడ్జెట్ పెట్టడం అంటే సాహసమనే చెప్పాలి. అసలే సూపర్ హీరోయిన్ సినిమాలని అంతగా పట్టించుకోని ప్రేక్షకులు కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆదరిస్తారా అనే సందేహం ఉంది. చూడాలి మరి ఆలీ అబ్బాస్ జాఫర్ ఏ విధంగా మెప్పిస్తాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: