మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తన హవా చూపిస్తున్నాడు. యాక్టింగ్ ఫైట్స్ డ్యాన్స్ డైలాగ్ డెలివరీ లలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన హోమ్ ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే అందరు హీరోలు వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ ఏ చిత్రం చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

అయితే ఈ రెండు భారీ ప్రాజెక్టుల అనంతరం చెయ్యబోయే ప్రాజెక్టుకు గాను చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి. ఈ క్రమంలో ముందుగా రామ్ చ‌ర‌ణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోతున్నాడనే న్యూస్ బయటకి వచ్చింది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారని రూమర్ వచ్చింది. దీని మీద రోజుకో వార్త షికారు చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పుకార్ల మీద క్లారిటీ వచ్చింది. ట్రిపుల్ ఆర్ తరువాత రామ్ చరణ్ - అనిల్ రావిపూడి సినిమా లేదని.. ఆ న్యూస్ పుకారు మాత్రమే అని ఇప్పుడు మరో న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని.. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడని న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేసింది. కానీ దీని గురించి మళ్ళీ ఎటువంటి అప్డేట్ రాలేదు.

 

ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఓ టాలెంటెడ్ దర్శకుని పేరు కూడా వినిపిస్తుంది. అతను మరెవరో కాదు. “మళ్ళీరావా” “జెర్సీ” లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను టాలీవుడ్ ఆడియన్స్ కు అందించిన గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తన హిట్ సినిమా 'జెర్సీ' ని హిందీలో రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే రామ్ చరణ్ తో మూవీ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే గౌతమ్ చెప్పిన స్టోరీ లైన్ చరణ్ కి నచ్చిందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: