ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ అంటే తెలుగు పరిశ్రమలో 3 పిల్లర్లు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురూ కలిసి అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు వందల సినిమాలను అందించి ఎంతో అలరించారు. వారు ముగ్గురు కలిసి నటించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి వారి మధ్య స్నేహబంధం బలంగా ఉంటుందని ఎవరైనా ఊహించుకుంటారు. కానీ ఎన్టీఆర్ కృష్ణ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉండేదట. ఇద్దరి మధ్య స్నేహబంధం చెడిపోవడానికి ఒక్కటే ఒక కారణమని సినీ వర్గాలు చెబుతుంటాయి. అభిమానుల వల్ల వీళ్లిద్దరి స్నేహం చెడిపోవడం, అలాగే వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు, మనస్పర్ధలు రావడం వలన బద్ద శత్రువులు అయ్యారు. 


తెలుగు పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాద్ నగరానికి తీసుకోచ్చిన ఎన్టీఆర్ తో ఏఎన్ఆర్ గొడవ పెట్టుకున్నారట. కృష్ణ కూడా భీభత్సమైన రచ్చరచ్చ చేసి ఎన్టీఆర్ తో విపరీతంగా గొడవ పెట్టుకున్నాడు. ఒక సినిమా టైటిల్ ఈ విషయంలో ఎన్టీఆర్, కృష్ణ లకు మనస్పర్థలు వచ్చాయి. ఫిలిం చాంబర్ లో మొట్టమొదటిగా ఎవరు సినిమా టైటిల్ని రిజిస్టర్ చేయించుకుంటారో వారికే ఆ టైటిల్ సొంతమౌతుంది. మిగతా వారు ఆ టైటిల్ ని తమ సినిమాలకు పెట్టుకునే అర్హత ఉండదు. 


కానీ తెలుగు పరిశ్రమలో ఇద్దరు బడా నిర్మాతలు ఒక టైటిల్ కోసం గొడవ పెట్టుకోగా... వీరి గొడవలోకి ఎన్టీఆర్ కృష్ణ జోక్యం చేసుకొని చిట్టచివరికి కోర్టులో తేల్చుకుందాం అనే వరకు వెళ్లారు. 1983వ సంవత్సరంలో నిర్మాత శేఖర్ బాబు సామ్రాట్ అనే టైటిల్ని ఫిలిం ఛాంబర్ కి వెళ్లి రిజిస్టర్ చేయించారు. ఆ సంవత్సరం నుండి ఆ టైటిల్ ఎవరు తీసుకోకూడదని చెబుతూ రెన్యువల్ చేస్తూ వచ్చారు నిర్మాత. తదనంతరం అనగా 1987 లో నిర్మాత శేఖర్ బాబు... బాలకృష్ణ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సాహస సామ్రాట్ అనే పేరు పెట్టించారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు తో సామ్రాట్ అనే చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. 


అయితే సామ్రాట్ అనే టైటిల్ని తాము ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నారని మీరు వేరొక టైటిల్ని చూసుకోవాలని నిర్మాత శేఖర్ బాబు కృష్ణ కొడుకు యొక్క నిర్మాతకు చెప్పడంతో గొడవ స్టార్ట్ అయింది.పెద్దకొడుకు సినిమా యొక్క టైటిల్ని రిజిస్టర్ చేయించింది కృష్ణ సోదరుడు హనుమంతరావు. అందుకే తాను ఆల్రెడీ వేరొక సినిమా టైటిల్ లో సామ్రాట్ అని ఉన్నప్పటికీ.. కృష్ణ సినిమా కి కూడా సామ్రాట్ అనే శీర్షికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిలింఛాంబర్లో హనుమంతరావు కి బాగా పలుకుబడి ఉండడంతో శేఖర్ బాబు సినిమా టైటిల్ విషయంలో అన్యాయం జరిగింది. చివరికి ఎన్టీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. దీంతో కృష్ణ కి బాగా కోపం రాగా ఎన్టీఆర్ తో గొడవ పెట్టుకున్నాడు. 


ఇరువర్గాలు న్యాయపోరాటం కూడా చేశారు. శేఖర్ బాబు స్థానిక కోర్టుని ఆశ్రయించగా అక్కడ తనకి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ కృష్ణ హైకోర్టును ఆశ్రయించగా... అక్కడ తనకి అనుకూలంగా తీర్పు రావడంతో శేఖర్ బాబు తన సామ్రాట్ సినిమాకి సాహస సామ్రాట్ అని టైటిల్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కృష్ణ మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ తర్వాత కృష్ణ వర్గం, ఎన్టీఆర్ వర్గం అంటూ తెలుగు పరిశ్రమలో రెండు వర్గాలుగా విడిపోయాయి. ఈ గొడవ తర్వాత కూడా ఎన్టీఆర్ పై కృష్ణ ఎన్నో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: