రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. చిరుత సినిమాలో డబ్బున్న అమ్మాయిగా పొగరుగా కనిపించే పాత్రలో జీవించిందనే చెప్పాలి. పూరి జగన్నాథ్ ముంబయి నుండి దిగుమతి చేసిన ఈ అందానికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. చిరుత సినిమా ద్వారా మంచి పేరే వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నటించినా ఫలితం లేకుండా పోయింది.

 

దాంతో అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా అవకాశాలు అంతంతగానే వస్తున్నా కెరీర్ ని మెల్లగా నడిపించుకుంటూ వెళ్తుంది. నేహా శర్మకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె ఇన్స్టా అకౌంట్ ద్వారా అభిమానులకి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుని చిత్తు చేస్తూ, కవ్విస్తూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు.

 

 

దాంతో ఆమెకి బాలీవుడ్ లో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాని వదలకుండా హాట్ హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆమె నల్లటి బికినీలో కనిపించి ఆమె ఫాలోవర్లని మాయలో పడేసింది. నల్లటి బికినీలో తెల్లగా మెరుస్తున్న అందాలు దట్టమైన చీకటిలో వెన్నల కురిసినంత అందంగా కనిపిస్తున్నాయి. ఆ నలుపు బికినీలో నేహా శర్మ అందం మరింత రెట్టింపైంది. 

 

చిరుత సినిమా వచ్చి పదేళ్ళు పూర్తవుతున్నా ఆమె అందంలో ఇసుమంతైనా మార్పు రాకపోవడం గమనార్హం. అప్పటి కన్నా ఇప్పుడే ఇంకా అందంగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇంతలా అందాల వరద పారిస్తూంటే ఆమె ఫాలోవర్లు మరింత పెరుగుతారు. లాక్డౌన్ టైమ్ లో కూడా అందాలని లాక్ చేయకుండా వదిలేసింది. ప్రస్తుతం నేహాశర్మ తైషే అనే బాలీవుడ్ చిత్రంలో కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: