తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు ఏదో వివాదం ఉందని తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ విషయం గురించి తెలుగు సినిమా అభిమానులకు అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అభిమానులతో క్లారిటీ ఇచ్చేందుకు ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తన కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఏముందనేది చెప్పుకొచ్చాడు. 

IHG
తాను మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. తాను ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు కూడా. కానీ ఎవరో చెప్పిన మాటలు విని అతనికి దూరం అయ్యాను. మళ్ళీ నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకే ఈ సందర్భంగా తనకు తన అభిమానులకు క్షమాపణ చెబుతున్నాను టీవీ9 ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా తప్పుగా మాట్లాడాను. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న నా మాటలకు చాలా బాధ పడ్డాడని తెలుసుకున్నాను. ఎన్టీఆర్ కు నాకు విభేదాలు ఉన్నాయని టీవీ9 ఇంటర్వ్యూ లో చెప్పాను.


'చెప్పుడు మాటల కారణంగానే అలా మాట్లాడాను నిజానికి తార నన్ను ఏ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎన్టీఆర్ తో కలిసి బాద్షా సినిమా చూశాను కానీ అది నాకు నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు టెంపర్ సినిమా తీశాను బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను', అని అతడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం అవుతోంది. ఎందుకంటే మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా... బండ్ల గణేష్ జూనియర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తనదైన శైలిలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: