2014వ సంవత్సరంలో ఎన్నికల సమయంలో సమాజవాది పార్టీ నేత అమర్ సింగ్ తరఫున ప్రచారం చేసేందుకు శ్రీదేవి ఒప్పుకొంది. అప్పట్లో అమర్ సింగ్ తో శ్రీదేవి బాగా సన్నిహితంగా ఉండేది. ఆ పరిచయంతో ఆమె ఎన్నికల ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే జయప్రద కూడా అమర్ సింగ్ కి పరిచయం కావడంతో ఆమె కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది. ఒకానొక సమయంలో అమర్ సింగ్, శ్రీదేవి, జయప్రద ఒకే ప్రాంతంలో కలవడంతో... అమర్ సింగ్ జయప్రదని శ్రీదేవికి పరిచయం చేస్తుండగా... శ్రీదేవి మాత్రం జయప్రద ఎవరో కూడా తెలియనట్టు వ్యవహరించింది. దాంతో జయప్రద శ్రీదేవి పై కోపం పెంచుకుంది. 


అప్పటినుండి వారిరువురి మధ్య అనేకమైన విమర్శలు చోటుచేసుకున్నాయి. నిజానికి అంత కంటే ముందే జయప్రద జయసుధ శ్రీదేవి పై అత్యంత కోపం పెంచుకున్నారు. 1975-90 కాలంలో జయసుధ, జయప్రద తెలుగు హీరోయిన్లగా కొనసాగుతున్నారు. అదే సమయంలో శ్రీదేవి తన అందచందాలతో అభినయంతో వీరిద్దరికీ గట్టిపోటీని ఇచ్చింది. దాంతో జయసుధ జయప్రద శ్రీదేవి తో సరిగా మాట్లాడకుండా అసూయ పెంచుకునేవారు. బాలీవుడ్ లో గొప్ప నటి అయిన మాధురి దీక్షిత్ కూడా శ్రీదేవి గట్టి పోటీ ఇచ్చారు. 


అప్పట్లో జయప్రద బాలీవుడ్ లో అరంగేట్రం చేసినప్పుడు... శ్రీదేవి తో మళ్లీ గొడవలు వచ్చాయి. వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలగించే రాజీ కుదిర్చేందుకు టాలీవుడ్ హీరోలు రాజేష్ ఖన్నా జితేంద్ర లు అనేక విధాలుగా ప్రయత్నించారు. వాళ్ళిద్దర్నీ ఒక గదిలోకి తోసి తాళం వేసి మాట్లాడుకోండి అంటూ రాజేష్ ఖన్నా జితేంద్ర లు చెప్పారు. కానీ గంటల సమయం గడుస్తున్నా వారు ఒక్కమాట కూడా మాట్లాడుకోకుండా వ్యతిరేక దిశలలో కూర్చుండిపోయారు. ఈ సంఘటన 1984వ సంవత్సరంలో చోటు చేసుకుంది. తోఫా, మక్సద్ సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు కానీ సెట్స్ లలో అస్సలు పలకరించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: