తెలుగు చిత్రం ప‌రిశ్ర‌మ‌లో మెగా ఫ్యామిలీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముఖ్యంగా మెగా కుటుంబలో మెగ‌స్టార్ చిరంజీవి.. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ సంపాదించిన వ్యక్తి. అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీ విషయంలో చీమ చిటుక్కుమన్నా మీడియా దానిని హైలెట్ చేసి వార్తలు ప్రచురించే కార్యక్రమం పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్ మరియు చిరంజీవి మధ్య మనస్పర్థలు వచ్చాయని, బావా, బావమరుదులు ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని ప్రముఖంగా వినిపించింది. వాస్త‌వానికి చిరంజీవి, అల్లు అరవింద్ ఇద్దరిదీ విడదీయలేని బంధం అని అందరికీ తెలిసిన విషయం. 

 

చిరంజీవి తాను తీసుకునే ప్రతీ నిర్ణయంలో అల్లు అరవింద్ సలహాలు, సూచనలుంటాయని ఎన్నో మార్లు బహిరంగంగానే చెప్పిన సందర్భాలున్నాయి. అయితే వారి మధ్య రిలేషన్ ఎలా ఉన్నా.. బయటకు మాత్రం వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ రెండు ఫ్యామిలీస్ మద్య గొడవలు జరుగుతున్నాయని, విభేదాలున్నాయని వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చరణ్ సొంత బ్యానర్ పైనే ఆయన సినిమాలు నిర్మిస్తుండటం, గీతా ఆర్ట్స్ వారికి అవకాశం ఇవ్వకపోవడం మనస్పర్థలను మరింత పెంచాయనే ప్రచారం జరుగుతోంది. 

 

అలాగే అల్లు అరవింద్ తన కుమారుడు బన్నీ కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. రామ్ చరణ్ విషయాలు పట్టించుకోకపోవడంతో మెగాస్టార్ కాస్త ఆవేదనకు గురైనట్లు కూడా వార్తలు గతంలో వినిపించాయి. వీటితో పాటు బన్నీ మాటలు, చేసే చేష్టలు ఈ అనుమానాలకు తావిచ్చేలా ఉంటాయి. ఒక్కోసారి మెగా ఫ్యామిలీతో సంబంధాలు లేనట్టు మాట్లాడుతుంటాడు. కేవలం అల్లు బ్రాండ్, అల్లు ఫ్యామిలీ గురించే చెప్పడంతో రెండు కుటుంబాల్లో విభేదాలు ఏర్పడ్డాయనే వార్తలు వస్తుంటాయి. అయితే వీటిపై చిరంజీవి, అల్లు అర్జున్ చెక్ పెడుతూనే ఉంటారు. 

 

మా ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా అందులో అల్లు అరవింద్‌ ఫ్యామిలీ కూడా ఉంటుంది.అందులో ఎలాంటి అనుమానం ఉండదు.ఎటువంటి వివాదాలు విభేదాలు మా మద్య ఉండవు.మేమంతా కూడా ఒకే కుటుంబ అని చిరంజీవి ఎన్నో సార్లు చెప్పారు. అల్లు అర‌వింద్ కూడా  మా మధ్య విభేదాలు ఉన్నాయనడంలో ఎంతమాత్రం నిజం లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌ర‌ణ ఇస్తూనే ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు కొడుతూనే ఉంటాయి. మ‌రి ఇవి ఎంత వ‌ర‌కు నిజం..? అన్న‌ది ఆ రెండు కుటుంబాల‌కే తెలియాలి.

   

మరింత సమాచారం తెలుసుకోండి: