కొందరు జీవితంలో ఎదుగుతారు. కొందరు మాత్రం ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. మరికొందరు ఆదర్శంగా ఉండడంతో పాటు వెనుకున్న వారికి కొండంత అండగా నిలుస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో శక్తి స్వరూపంలా ఎదిగిన దాసరి నారాయణరావు ఆ మూడో కోవకు చెందుతారు. కావటానికి సినీ దర్శకుడే అయినా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కతాటిపై నడిపించారు. దాసరి దగ్గరకు వెళ్లకుండా ఇండస్ట్రీలో ఏ పని జరగదు.. ఏ సమస్యా పరిష్కారమవ్వదు. ఇవన్నీ ఆయన సృష్టించుకోలేదు. ఇండస్ట్రీనే ఆయనకు ఆ హోదా ఇచ్చింది. అంతటి ధైర్యం, తెలివి, సమయస్ఫూర్తి దాసరి సొంతం. నేడు ఆయన వర్ధంతి.

IHG'S FIRST EVER METHOD ACTOR ...

 

వీటన్నిటికంటే దాసరి ఓ దర్శకుడు. దర్శకుడిగా ఆయన సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. దర్శకుడికే మాస్ ఇమేజ్ తెచ్చిన వ్యక్తిగా దాసరికి పేరు ఉంది. హీరోకు మాత్రమే అభిమాన సంఘాలు ఉన్న పరిస్థితుల్లో దర్శకుడికి కూడా అభిమాన సంఘాలు పెట్టేంత ఎత్తుకి దాసరి ఎదిగారు. ఆయనకు ముందు తర్వాత మరే దర్శకుడికి కూడా అభిమాన సంఘాలు లేవు. దర్శకత్వంలో తీసుకొచ్చిన కొత్త పోకడలు, మార్పులు దాసరిని తిరుగులేని దర్శకుడిగా మార్చాయి. కథ, కథనాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ఇలా ప్రతి విభాగంలో కూడా తనదైన ముద్ర వేసి దర్శకులకు ఆదర్శంగా నిలిచారు.

IHG

 

ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ప్రేమాభిషేకం రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. దర్శకుడిగా 150 పైచిలుకు సినిమాలకు దర్శకత్వం వహించి ఇకపై మరెవరూ అందుకోలేని రికార్డును సొంతం చేసేకున్నారు. దాసరి నారాయణరావుపై ఇదొక చరిత్రగా నిలిచిపోయే రికార్డు. తెలుగు ప్రేక్షకులను, సినీ పరిశ్రమను ఆయన వదిలి వెళ్లిపోయినా.. గురువు గారిగా ఇండస్ట్రీలో, దర్శకరత్నగా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు దాసరి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: