తెలుగు సినీ రచయిత కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్ బాహుబలి విక్రమార్కుడు మగధీరా చత్రపతి, యమదొంగ, చివరికి ఆర్ఆర్ఆర్ సినిమాలకి కూడా కథను అందించారు. ఇతను ఎంత గొప్ప రచయిత అంటే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమాకు కూడా స్వయంగా తానే కథను అందించాడు. ఈ చిత్రం అనేక దేశాల్లో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


కంగనా రనౌత్ నటిస్తున్న తలైవి చిత్రానికి కూడా ఇతను కథను అందించాడు. గతంలో కంగనారనౌత్ నటించిన మణికర్ణికా చిత్రానికి కథను అందించి భారతదేశంలోనే గొప్ప రచయిత గా పేరు పొందాడు. తన కథతో రూపొందించిన సినిమాల్లో ఏ హీరో నటించిన అతనికి పేరు ప్రఖ్యాతలు విపరీతంగా వస్తాయి. ఐతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్... రాజమౌళి దర్శకత్వంలో గాని, విజయేంద్రప్రసాద్ రచనలో రూపొందిన చిత్రంలో గాని నటించలేదు. అయితే భవిష్యత్తులో అయినా పవన్ కళ్యాణ్ విజయేంద్రప్రసాద్ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అని విజయేంద్ర ప్రసాదే అడిగితే తాను అనేకమైన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 


'పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే తను మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తాడు. అమ్మ ఏం ఆలోచిస్తే అదే చెప్తాడు. తాను ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా చేస్తాడు. అతని సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినట్టు నేను సంతోషపెడతాను. అతనిలో నటన ప్రతిభ, దర్శకత్వ నైపుణ్యం సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో తనకు ప్రతిభ ఉంది. కానీ అతని సినిమా కథలు బాగోలేకపోవడంతో అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పవన్కళ్యాణ్ జానీ సినిమా చాలా చక్కగా రాశారు. కానీ ప్రేక్షకులు ఎవరు ఆ సినిమా అంతగా ఆదరించలేదు. అదే ఒక ప్రముఖ రచయిత జానీ సినిమాకి కథ అందించినట్లయితే వేరేలా ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తపడితే బాగుంటుంది. ఒకవేళ అవకాశం వస్తే అతనికి బ్రహ్మాండమైన కథ రాస్తాను', అని ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. మరి ఈ డ్రీం కాంబినేషన్ ఎప్పుడు నిజమవుతుందో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: