మెగాస్టార్ చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్తో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకుల మెగా స్టార్ గా మారిపోయారు. మొదట్లో సాదాసీదా పాత్రలను దక్కించుకున్న చిరంజీవి తన టాలెంట్ తో ఏకంగా  సినిమాల్లో హీరోగా ఛాన్స్ ని దక్కించుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మొదటినుంచి డాన్సులు ఇరగ దీస్తూ  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని సరికొత్త డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లు మెగాస్టార్ తో కలిసి సరి దీటుగా డాన్స్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడేవారు. 

 


 ఇకపోతే మెగాస్టార్ తన సినీ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎంతమంది హీరోయిన్లతో నటించినప్పటికీ మెగాస్టార్ తో సరియైన జోడి అనిపించుకుంది  మాత్రం విజయశాంతి. మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే కేవలం డాన్స్ పర్ఫార్మెన్స్ లోనే కాదు నటన పరంగా కూడా విజయశాంతి మెగాస్టార్కు సారథిటు అని నిరూపించుకుంది. అయితే టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సమయంలోనే మరో వైపు విజయశాంతి కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ హీరోల  లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. 

 

 ఇక విజయశాంతి డైలాగులు చెప్పడంలో దిట్ట అని చెప్పాలి. దీంతో మెగాస్టార్ నేను గొప్ప అంటే విజయశాంతి నేను గొప్ప అంటూ ఇద్దరి మధ్య ఒక చిన్న ఇగో మొదలైంది. కొన్నిసార్లు షూటింగ్లో కూడా మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి లు  నేను గొప్పంటే నేను గొప్పని అని మాట్లాడుకునేవారు అంటూ సమాచారం. కొన్ని కొన్ని సార్లు ఇలా ఇద్దరికీ ఇగో లు  సీరియస్ అయ్యేంత వరకు కూడా వెళ్లాయి  అని అప్పట్లో ప్రచారం  కూడా జరిగింది . అందుకే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి సినిమాలు చేయడం మానేసింది అనే ప్రచారం కూడా అప్పట్లో జోరందుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి ల మధ్య వివాదం కొన్ని రోజుల పాటు టాలీవుడ్ ఊపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: