మామూలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకుల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందన్న విషయం తెలిసిందే . కానీ కొంతమంది మధ్య మాత్రం కోల్డ్  వార్  ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కొన్నిసార్లు ఇలా దర్శకుల మధ్య ఏర్పడిన వివాదం తెరమీదికి మీడియా ముందు కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న బోయపాటి కొరటాల మధ్య కూడా ఓ వివాదం నడుస్తోందని  విషయం చాలా మంది సినీ ప్రేక్షకులకు తెలియదు. వీరిద్దరి మధ్య భద్ర సినిమా సమయంలోనే ఓ వివాదం తెరపైకి రాగా అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. 

 

 ఇంతకీ వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఏమిటి  అంటే.. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి దగ్గరే శిష్యరికం చేశారు కొరటాల శివ బోయపాటి శ్రీను. అప్పట్లో పోసాని కృష్ణ మురళికి రచయితగా ఎంతో గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి దగ్గరే పవీరు  శిష్యరికం చేశారు. అయితే ఆ తర్వాత అటు బోయపాటి శ్రీను ఇటు కొరటాల శివ తమదైన శైలిలో చిత్ర పరిశ్రమలో దర్శకులుగా రాణించిన విషయం తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను రవితేజతో భద్ర సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను కెరీర్ కి మంచి బాటలు వేసింది భద్ర సినిమా. 

 

 ఇక ఈ సినిమా గురించి బోయపాటి శ్రీను కొరటాల శివ మధ్య వివాదం తలెత్తింది. భద్ర సినిమా కథ తనదేనని కొరటాల శివ ఆరోపణలు చేశారు. అది భద్ర సినిమా విడుదలైనప్పుడు కాదు.. ప్రభాస్ తో తెరకెక్కించిన మిర్చి,  మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా విజయం సాధించిన తర్వాత ఒకప్పుడు బోయపాటి తెరకెక్కించిన భద్ర సినిమా కథ తనదేనని పలు వ్యాఖ్యలు చేశాడు కొరటాల శివ. కథ మాటలు నావేనని కానీ ఈ సినిమా విషయంలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదు అంటూ ఆరోపణలు చేశాడు. అయితే ఈ సినిమాకి కొరటాల శివ తో పాటు ఎంతోమంది పనిచేశారని... ఒక్క  కొరటాల శివకు మాత్రమే ఎలా క్రెడిట్ ఇస్తారు అంటూ సమాధానమిచ్చాడు బోయపాటి . ఇక అప్పటినుంచి బోయపాటి కొరటాల మధ్య వార్ నడుస్తోంది. అయితే ఆ తర్వాత బోయపాటి కొన్ని విజయవంతమైన కొన్ని ఫ్లాపులు కొన్ని విజయాల తో స్టార్ డైరెక్టర్ గా మారితే...  అటు కొరటాల  శివ కూడా తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి  ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: