సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాగా ఈ సినిమా అయిన వెంటనే వంశీ పైడిపల్లి తో మహేష్ సినిమా ఉంటుందనుకున్నా అందరికీ ఆ సినిమా క్యాన్సిల్ అవడంతో మహేష్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఓకే అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ మధ్యలో కరోనా వైరస్ రావటంతో  లాక్ డౌన్ అమలులో ఉండటంతో సినిమా థియేటర్లు,  సినిమా షూటింగులు మొత్తం బంద్ అయిపోయాయి.

IHG's mirror selfie with daughter Sitara goes viral, see ...

అయితే ఇటీవల సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలు అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు మూడు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట. అందుకోసమే విపరీతంగా లాక్ డౌన్ టైం లో వర్క్ ఔట్స్ చేస్తున్నాడట. ఒక టీనేజ్ కుర్రాడు లాంటి పాత్ర మరో రెండు పాత్రలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయని అందుకోసమే మహేష్ బాబు జుట్టు పెంచడం జరిగిందని ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  ఇదివరకే ఇటీవల సినిమాకి సంబంధించి 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.

Lockdown Shenanigans: IHG shares a funny video of ...

కాగా ఈ నెల 31వ తారీఖున కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా ప్రాజెక్ట్ డీటెయిల్స్ మహేష్ చెప్పే అవకాశం ఉందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. పరుశరామ్ సినిమా త్రిపాత్రాభినయం అదే విధంగా సరికొత్త లవ్ స్టోరీ అని వార్తలు రావడంతో మహేష్ బాబు అభిమానులకు ఇది అదిరిపోయే వార్త అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: