తెలుగు సినీ పరిశ్రమలో తొంభై దశకంలో ఉన్న టాప్ డైరక్టర్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి. ఫ్యామిలీ మూవీస్ కు, కామెడీ మూవీస్ తీయడంలో కృష్ణారెడ్డి అందె వేసిన చేయి. ఓ దశలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ఎస్వీ కృష్ణారెడ్డికి మధ్య పోటీ నడిచింది అనే చెప్పాలి. ఇంత పోటీలో కూడా ఎస్వీ కృష్ణారెడ్డి తన మార్కు సినిమాలతో రాణించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటి మావిచిగురు’. జగపతిబాబు హీరోగా వచ్చిన ఆ సినిమా విడుదలై నేటితో 24ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా 1996 మే30న విడుదలైంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను.. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణ బాగా దక్కించుకుంది. అంతకు రెండేళ్ల ముందే జగపతిబాబుతోనే ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన శుభలగ్నం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శుభలగ్నం తరహాలోనే ఇంకాస్త ఎక్కువగా పూర్తి మహిళా సెంటిమెంట్ తో తెరకెక్కింది మావిచిగురు. అయినా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మంచి ఫ్యామిలీ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆమని, రంజిత ముఖ్య పాత్రల్లో నటించారు. ఆమని పాత్ర చనిపోతూ రంజితతో జగపతిబాబుకు పెళ్లి జరగడంతో సినిమా ఎండింగ్ ఉంటుంది.

IHG

 

స్రవంతి మూవీస్ రవి కిశోర్, చంద్రకిరణ్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చే కృష్ణారెడ్డి మరోసారి మాయ చేశారు. సంగీతపరంగా పాటలన్నీ హిట్టయ్యాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ కథల్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. సినిమా విజయవంతం కావడంతో పలు సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా ఈ వేడుకలను నిర్వహించారు. జగపతిబాబు కెరీర్లో మరో హిట్ గా నిలిచిందీ సినిమా.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: