మోహన్ బాబు విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్. ఆయన తెలుగు సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నట శిఖరం. ఇపుడున్న సీనియర్ నటులలో ఆయన ఒకరు. ఇప్పటికీ యాక్టివ్ గా ఉంటూ సినిమాలు చేస్తున్న మోహన్ బాబు దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు డిస్కవరీ. దాసరి తీసిన స్వర్గం నరకం మూవీ ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యారు.

 

ఇవాళ దాసరి మరణించి మూడేళ్ళు అయింది. దాసరి వర్ధంతి సందర్భంగా ఆయనకు మోహన్ బాబు ఘన నివాళి అర్పించారు. ట్విట్టర్ ద్వారా మొహన్ బాబు దాసరిని కొనియాడారు. దాసరి తన గురువు గారు అంటూ తన లాంటి ఎన్నో దీపాలను వెలిగించి చిత్ర సీమకు ఆయన అందించారని మోహన్ బాబు అన్నారు.

 

దాసరి లాంటి వారు మళ్ళీ పుట్టరు, ఆయనకు ఆయనే సాటి అంటూ మోహన్ బాబు అన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్టులకు సంబధించిన సమస్యలపైన పూర్తి అవగాహన ఉనన్ వ్యక్తి దాసరి అని కూడా చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు దాసరి లాంటి వారు అండగా నిలిచినట్లుగా  మరెవరూ నిలబడరు అని మోహన్ బాబు అన్నారు.

 

ఇది మామూలుగా మొహన్ బాబు అన్నా ఇపుడు సినీ పెద్దరికం కోసం జరుగుతున్న పోటీ, మాటల తూటాలు అటూ ఇటూ పేలుతున్న నేపధ్యంలో మోహన్ బాబు మాటలను చూస్తే దాసరి లాంటి వారు ఇండస్ట్రీకి ఇపుడు లేరని, ఆ పెద్దరికం ఆయనతోనే పోయిందన్న  సౌండ్ వస్తోంది.

 

ఇది నిజమే కూడా. ఎందుకంటే దాసరి అందరివాడు అనిపించుకున్నారు. ఆయనకు చిన్నా పెద్దా తేడా లేదు. దాసరి ఒక మాట చెబితే అదే ఫైనల్. కొత్తగా ఎక్కడా  పంచాయతీలు ఉండవు. కానీ ఇపుడు చూసుకుంటే సినీ సీమలో పెద్దరికం కోసం పోటీ పడుతున్న వారి మధ్యన వర్గాలు, గొడవలు వస్తున్నాయి. 

 

ఈ సమయంలో మోహన్ బాబు వన్ అండ్ ఓన్లీ దాసరి మాత్రమే అనడం మాత్ర్రం చర్చకు దారి తీస్తోంది. అన్నట్లు ఇపుడు సినీ పెద్దల మీటింగునకు మోహన్ బాబుని కూడా పిలవలేదన్న సంగతిని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. ఆల్రేడీ తనను ఎవరూ పిలవలేదని మరో సినీ నటుడు బాలక్రిష్ణ‌ అనడం ఈ సందర్భంగా గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: