హీరో సూర్య అన్నంత పని చేశారు. ఇక ముందట OTT కోసమే సినిమాలు తీస్తారని అసలు థియేటర్లో సినిమాలు చెయ్యను అన్న దానికి కట్టుబడి ఆయన తన భార్య జ్యోతికను హీరోయిన్ గా పెట్టి తన పాత్రకు తగ్గట్టు గానే తను ఇప్పుడు అనవసరపు ఖర్చులు లేకుండా, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టి, పనికిమాలిన అట్టహాసాలు జోలికి పోకుండా తన భార్యను దృష్టిలో పెట్టుకొని కథను ముందుకు నడిపించి ఓ సినిమా తీశారు. ఆ సినిమాకు హీరో సూర్య నే నిర్మాతగా వహించాడు. 


ఇక ఈ సినిమాకు సంబంధించి జ్యోతికను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు జెజె. ఫెడరిక్ తన కథను వ్రాసుకున్నారు. అయితే ఎక్కడ గీత దాటకుండా పరిమితులను ఇంకాస్త భిన్నంగా కొత్త కథను చెప్పే వీలు ఉండదు. అయితే ఫెడరిక్ ఆ ప్రయోగాలు అలాంటివి చేయకుండా కథను అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం వరుసగా చిన్న పిల్లల హత్యలు జరిగేవి. పోలీసులు ఉత్తరాది మహిళను నేరస్థులుగా చిత్రీకరించి ఆమెను ఎన్కౌంటర్ చేసి పారేశారు. కాకపోతే ఆ కేసును ఇన్నాళ్ళ తర్వాత జ్యోతిక టేకప్ చేస్తుంది. ఇక అలా ఆ మహిళ గురించి పూర్తి వివరాలు సేకరిస్తూ... ఆమె నేరస్థులే కాదు మరి ఎవరు అని కథాంశంతో ఆ సినిమాను నడిపిస్తూ తీసుకు వెళ్ళాడు. ఇకపోతే OTT ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వాళ్లకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిన సినిమా. 


ఇక ఈ సినిమాలో పాటలు, డైలాగులు, కథలో ట్విస్టులు, విలన్లకు ఎత్తుగడలు ఎక్కడ ఎక్కువగా కనపడవు. అంతేకాకుండా కథని ముందుగానే ఉంచడంతో OTT లో కూడా ఈ సినిమాను ఫార్వర్డ్ చేసుకుంటూ ఎట్టకేలకు సినిమా చూసే అనిపించుకునే విధంగా ఈ కథాంశం చిత్రీకరించబడింది. మొత్తానికి ఈ సినిమాలో సూర్య భార్య అన్న జ్యోతిక తన పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చారు. ఇకపోతే అమెజాన్ లో నేరుగా రిలీజ్ చేశారు. ఈ సూర్య జ్యోతిక సినిమాకు పాస్ మార్కులే తప్ప ఫస్ట్ క్లాస్ మార్కులు రాలేదని చెప్పొచ్చు. ఇకపోతే లాక్ డౌన్ తో సినిమాలు రిలీజ్ కాకపోవడంతో అందరూ OTT ల మీద అ సినిమాలు చూస్తూ ఉండడంతో ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: