పెళ్లి అయిన తర్వాత కూడా చాలా వరకు మంచి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది సమంతా. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా ను ఆమె నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె సినిమాలు ఈ మధ్య కాలంలో ఆమెకు షాక్ ఇస్తున్నాయి. జానూ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడినా సినిమా మాత్రం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమె ఏ సినిమా చేస్తుంది అనేది అర్ధం కావడం లేదు. ఇక ఇప్పుడు ఆమెకు ఒక ఆఫర్ ఆమెకు తమిళంలో వచ్చింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

టాలీవుడ్ లో ఆమెకు ఇంకా క్రేజ్ తగ్గలేదు అని అంటున్నారు. రామ్ చరణ్ కొరటాల శివ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి ఆ సినిమాలో ఆమెను ఇప్పటికే బుక్ చేసారని అంటున్నారు. అదే విధంగా పవన్ క్రిష్ సినిమాలో కూడా ఆమె నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆమెకు ఇప్పటికే పవన్ నుంచి క్రిష్ నుంచి కూడా ఫోన్ వచ్చింది అని అంటున్నారు. దీనితో ఆమె ఆ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఖాళీ గానే ఉంటుంది. 

 

భర్త తో కలిసి ఒక సినిమా చేయడానికి గానూ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శకుడు ఎవరు అనేది తెలియదు గాని ఆమె ఆ సినిమాలో నటించడం దాదాపుగా ఖాయమని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అనేది టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే కొందరి మాట కాదు అనలేక ఆమె సినిమాలను చేస్తుంది అని సమాచారం. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: