టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ లకు డిమాండ్  అనేది ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత ఉన్న నేపధ్యంలో ఇద్దరు హీరోయిన్ లను పెట్టుకుని సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొందరు దర్శకులు ఇక కొత్త హీరోయిన్ లను పరిచయం చెయ్యాలి అని భావిస్తున్నట్టు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. టాలీవుడ్ లో చిన్న చిన్న హీరోయిన్ లు చాలా మంది ఉన్నారు. వారికి టాలెంట్ ఉన్నా సరే అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇప్పుడు వారికి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి అని భావిస్తున్నారు. 

 

మన తెలుగులో కొందరు హీరోయిన్ లు పారితోషికం విషయంలో బెట్ ఎక్కువగా చేస్తున్నారు. దీని తో వారిని పక్కన పెట్టి వేరే వారిని తీసుకోవాలి అని భావిస్తున్నారు. బాలీవుడ్ లో అవాశాల కోసం కొందరు హీరోయిన్ లు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరిని ఇక్కడికి తీసుకుని వచ్చే ఆలోచనలి ఉన్నారు అని సమాచారం.  మరి ఎవరిని తీసుకు వస్తారు అనేది పక్కన పెడితే... దిశా పటాని పరిణితి చోప్రా కోసం టాలీవుడ్ లో ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దిశా పటాని ఇప్పటికే తెలుగులో ఒకటి రెండో సినిమాలు చేసింది. 

 

ఇక ఆమె తో పాటు పరిణితి చోప్రా ను ఇప్పటికే అడిగారు అని అంటున్నారు. ప్రస్తుతం వీరి కోసం ఫోన్ లు చేసి సిద్దంగా ఉన్నారు అని మరి వాళ్ళు సినిమాలు చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక మన తెలుగులో అవకాశాల కోసం ఎప్పటి నుంచో శ్రద్దా కపూర్ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. మరి ఆమెకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చూడాలి. ప్రభాస్ సినిమాలో ఆమె ఇప్పటికే నటించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: