కమర్షియల్ హీరో గా ఉన్న ప్రభాస్ తో సినిమా చేయడం అనేది నిర్మాతలకు దాదాపుగా కష్టమే. నిర్మాతలు ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి నష్టాల నుంచి బయటకు రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ ని తట్టుకోవడం చాలా కష్టంగా మారింది అనేది టాలీవుడ్ లో వినపడుతున్న టాక్. ప్రస్తుతం టాలీవుడ్ లో అతని తో అందరూ కూడా అగ్ర దర్శకులే సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

 

ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి చిన్న నిర్మాతలు అందరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆరుగురు నిర్మాతలు కలిసి ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. వంద కోట్ల బడ్జెట్ ని ఈ ఆరుగురు పెట్టుకుని సినిమా చేసే అవకాశం ఉందని, ఇప్పటికే తమ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత వరకు ఫలిస్తుందో గాని ప్రభాస్ మాత్రం చాలా వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని అంటున్నారు. దాదాపు తనకు రెండేళ్ళ వరకు ఖాళీ లేదు అని చెప్పాడు అని సమాచారం. 

 

నిజమా కాదా అనేది పక్కన పెడితే అతను ఇప్పుడు తెలుగులో చాలా వరకు బిజీ గానే ఉన్నాడు మరి. ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చిన్న  నిర్మాతలు అతని తో సినిమా చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అతను రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా లాక్ డౌన్ కారణంగా రెండు సినిమా లు ఆగిపోయాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: