టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. సినిమాల విడుదల కోసం అటు టాలీవుడ్ పెద్దలు అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనపడటం లేదు. లాక్ డౌన్ ఎప్పుడు పూర్తి అవుతుందో ఎప్పుడు సినిమాలను విడుదల చేస్తారో చెప్పడం ప్రస్తుతానికి చాలా కష్టంగా ఉందని అంటున్నారు. అటు కేంద్రం కూడా లాక్ డౌన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది అనేది వాస్తవం. 

 

లాక్ డౌన్ ని ఇప్పుడు కేంద్రం కొనసాగించాలి అని భావిస్తుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. వందల కేసులు వేల కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో వెనక్కు తగ్గితే మాత్రం ఇబ్బందులు వస్తాయి అనేది కేంద్రం భావన అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది కూడా. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని రాష్ట్రాల సిఎం లతో మాట్లాడారు. దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు అనే చెప్పవచ్చు. 

 

ఇక ఎప్పుడు అయితే లాక్ డౌన్ మినహాయింపు లు ఇచ్చారో అక్కడి నుంచి కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి అందుకే ఇప్పుడు ఇక మినహాయింపు లు ఇచ్చే ఆలోచన నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని తో సినిమాలు ఉండే అవకాశం లేదని సమాచారం. ఇప్పుడు సినిమాలకు అనుమతి ఇస్తే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. అందుకే ఇప్పుడు సినిమా ల విడుదలను ఆపేద్దామని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది. అయితే షూటింగ్ లకు మాత్రం అనుమతి ఇవ్వాలి అని చూస్తుంది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: