అగ్ర హీరోల్లో ప్రత్యేకంగా చెప్పుకునే హీరో ఎన్టీఆర్. అతని సినిమా విడుదల అవుతుంది అంటే చాలు అభిమానులకు ఒక రకంగా పండగ. అయితే రెండేళ్ళ నుంచి అతని సినిమా అనేది రాలేదు. మరో ఏడాది వరకు కూడా అతని సినిమా వచ్చే అవకాశ౦ లేదు అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మరి సినిమా షూటింగ్ లు మొదలైనా ఈ సినిమా మొదలవుతుందా లేదా అనేది చెప్పడం ప్రస్తుతం దాదాపు గా కష్టం అనే చెప్పాలి. 

 

అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతను ఒక వెబ్ సీరీస్ లో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. వెబ్ సీరీస్ లో అతను నటించడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అని దీనికి సంబంధించిన కథను తన ఫ్రెండ్ ఒకరు ఇచ్చారు అని దానికి నిర్మాతగా ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది అని సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ ని కేవలం తన ఇంట్లోనే అతను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఈ గ్యాప్ లో అతను రెండు వెబ్ సీరీస్ లను తన పెద్ద కొడుకుతో కలిసి చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని తో ఇప్పుడు రాజమౌళి కూడా  లేట్ అయినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. అభిమానుల నుంచి ఒత్తిడి రాకుండా ఉంటే చాలు అని సినిమాను చాలా స్వేచ్చగా తీయవచ్చు అని భావిస్తున్నారట. మరి ఎప్పుడు వస్తుంది సినిమా అనేది చూడాలి. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని భావించినా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: