టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన. ఆమె సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు తెలుగులో. దీనితో ఇప్పుడు ఆమెకు మంచి డిమాండ్ అనేది వచ్చింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆమె పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటిస్తుంది. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టంగా ఆంది. ఇక ఇప్పుడు ఆమె వివాహం చేసుకునే ఆలొచనలో ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె పెళ్లి చేసుకునే సూచనలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. 

 

ఆమెకు ఇప్పటికే పెళ్లి సంబంధాలు కూడా చూసారు అని ఆమె పెళ్లి చేసుకుని తర్వాతః సినిమాలు చేస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమెకు గతంలోనే నిశ్చితార్ధం కూడా అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల కారణంగా ఆ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె పెళ్లి కుదిరింది అని ఆమె పెళ్లి చేసుకోవడం ఖాయమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేసుకునే సూచనలు ఉన్నాయి అని పెళ్లి కొడుకు చెన్నై కి చెందిన వ్యక్తి అని సమాచారం. ఆమె వివాహం గురించి ఇప్పటికే కొందరికి సమాచారం కూడా వెళ్ళింది అని అంటున్నారు. 

 

ఇక ఆమె సినిమాలు మన తెలుగులో దాదాపు రెండు లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఎప్పుడు విడుదల అవుతాయి అనేది స్పష్టత రావడం లేదు. ఆమె ప్రస్తుతం బన్నీ తో ఒక సినిమా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ గ్యాప్ లో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: