మన తెలుగులో కొందరు దర్శకులు సినిమాలు చేసిన అలేకపోయినా సరే ప్రేక్షకులు మాత్రం వారి సినిమాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమాలు ఎప్పుడు వస్తాయి అనేది ఇది వరకు మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు అతని వరుస ఫ్లాపుల కారణంగా అతని క్రేజ్ అనేది తగ్గుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా ఇప్పుడు వినపడుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అతను కొన్ని కొన్ని కథలను సిద్దం చేసుకుని సినిమాలను చేయడానికి సిద్దంగా ఉంటున్నాడు. 

 

ఇప్పుడు అతను బాలకృష్ణ కోసం ఒక కథను సిద్దం చేసుకున్నారు అని సమాచారం. ఇక ఇప్పుడు మరో హీరో కోసం కూడా కథ రెడీ చేస్తున్నాడు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. రామ్ చరణ్ తో పూరి సినిమా చేయడానికి రెడీ అయ్యారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది తెలియదు గాని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పూరిసినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. కథ ఎప్పుడో రామ్ చరణ్ విన్నాడు అని టాక్. 

 

ఇక ఈ సినిమా కథను రెడీ చేసింది పూరి కాదని మరో దర్శకుడు అని సమాచారం.  మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్ ఇప్పుడు చాలా వరకు బిజీ గా ఉన్నాడు. మరి ఏ సినిమాను తర్వాత చేసే అవకాశం ఉంది అనేది తెలియదు. ఆర్ఆర్ఆర్ తర్వాత అతను గ్యాప్ తీసుకునే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి గ్యాప్ తీసుకుని ఏ సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: