వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ముందు తీసిన ‘రూలర్’ దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానికి ముందు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలకు సంబంధించి వచ్చిన రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఫుల్ నిరుత్సాహంలో ఉన్న బాలయ్య బాబు అభిమానులు కచ్చితంగా ఈ టైంలో బాలయ్య బాబుని బోయపాటి యే ఆదుకోవటం జరుగుతోందని అంటున్నారు.

IHG

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలు రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం వస్తున్న మూడో సినిమాతో గ్యారెంటీగా హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలయ్యకి బ్రేక్ ఇవ్వాలని నందమూరి ఫాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని షూటింగ్ లతో పాటు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో 'అఘోరా' పాత్రలో బాలయ్య నటిస్తున్నారని ఇప్పటికే బోయపాటి చెప్పడం జరిగింది.

IHG

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇంతకీ వైరల్ అవుతున్న టైటిల్ పేరు ‘మోనార్క్’. బాలయ్య మరియు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: