సూపర్ స్టార్ అంటే టాలీవుడ్లో ఒక్కరి పేరే చెప్పాలి. ఆయనే క్రిష్ణ. నాలుగు దశాబ్దాల క్రితం ఒక తెలుగు సినిమా పత్రిక నిర్వహించిన  పోటీలో నాటి హీరోల్లోకెల్లా ఎక్కువ ఓట్లు దక్కించుకుని సూపర్ స్టార్ బిరుదుని క్రిష్ణ సొంతం చేసుకున్నారు. క్రిష్ణ ఓ వైపు ఎన్టీయార్, మరో వైపు ఏయన్నార్, ఇంకోవైపు తన సమకాలీనులు శోభన్ బాబు, క్రిష్ణంరాజు వంటి వారు ఉన్నా సరే తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు.

 

ఆయన తెలుగులో ఏ హీరో నటించనివిధంగా 360 సినిమాలకు పైగా నటించారు. క్రిష్ణ ఏడాదికి 18 నుంచి 20 సినిమాలు చేసిన‌ రికార్డ్ కూడా ఉంది. రోజుకు మూడు షిఫ్టులు పనిచేసి సినిమా రంగంలోకివచ్చిన కేవలం ఎనిమిదేళ్ళకలంలోనే వంద సినిమాలు పూర్తి చేసిన చరిత్రను క్రిష్ణ సొంతం చేసుకున్నాడు. క్రిష్ణ వందల సినిమాలు చేశారు. అనేకమంది  హీరోయిన్ల‌ తో పదుల సంఖ్యలో జంట కట్టారు.

 

అలగే మల్టీ స్టారర్ మూవీస్ అందరి హీరోలతో చేసిన ఏకైన హీరో క్రిష్ణనే చెప్పాలి. అలాగే అప్పటి నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు అందరితోనూ పనిచేసిన ఘనత క్రిష్ణదే. ఇక తెలుగు సినిమాకు సాంకేతికతను పరిచయం చేసిన ఫస్ట్ పర్సన్ గా క్రిష్ణను చెప్పుకుంటారు.

 

ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీయార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అల్లూరి సీతారామరాజు క్రిష్ణ సొంతమైంది. లాండ్ మార్క్ విక్టరీగా నిలిచిపోయింది. ఇక క్రిష్ణకు అలాగే మరో డ్రీమ్ క్యారక్టర్ ఉంది. అదేంటి అంటే చత్రపతి శివాజీ. ఈ రోల్ వేయాలని క్రిష్ణ అనుకున్నారు. తన సినిమా డాక్టర్ సినీ యాక్టర్ లో శివాజీ వేషం కట్టి కొంత సేపు ఆ సరదా తీర్చుకున్నా పూర్తి నిడివి పాత్రలో సినిమాలో చేయాలని కోరిక అలాగే ఉండిపోయింది.

 

దానికి క్రిష్ణ అప్పట్లోనే కారణం చెప్పారు. శివాజీ కధ 16వ శతాబ్దలో జరిగింది. నాడు హిందూ ముస్లిం గొడవలు ఉన్నాయి. అప్పటి సామాజిక ఇతివ్రుత్తంతో సినిమా చేస్తే ఇపుడు అన్నదమ్ములుగా కలసిఉంటున్న రెండు వర్గాల మధ్య కొత్తగా కలతలు రేపినట్లవుతుందని భావించి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అలాగే ఉంచేశాను అని చెప్పుకొచ్చారు. మొత్తానికి క్రిష్ణ ఆ పాత్ర చేస్తే చూడాలనుకున్న అభిమానుల ఆశలు మాత్రం నెరవేరలేదు. ఏది ఏమైనా టాలీవుడ్ కి మాత్రం ఏకైక సూపర్ స్టార్ క్రిష్ణ అని చెప్పాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: