డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కుర్చీకి ఉండే విలువ ఏతో గొప్పది కాబట్టే దర్శకుడిగా ఆ కుర్చీలో కూర్చోవడానికి ఇండస్ట్రీకొచ్చి ఎన్నో కస్టాలను భరించి సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఒక్కసారి దర్శకుడిగా మారాక ఎన్ని ఒత్తిడులు ఉంటాయో పక్క వాళ్ళకి ఎంతమాత్రం అర్థం కాదు. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాపయినా ముందు ఒక మాట అనేది దర్శకుడినే. అంత ఒత్తిడిలో కూడా హీరోల స్టార్ ఇమేజ్ ని తీసుకు వస్తారు. నిర్మాతలకి కోట్ల ఆదాయాన్ని చూపిస్తారు. 

 

అయితే కరోనా లాక్ డౌన్ తో భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ మొత్తం ఎవరూ ఊహించని విధంగా మారాయి. రెడీగా ఉన్న సినిమాల రిలీజ్ పరిస్థితేంటో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతులివ్వడానికి సిద్దమవుతున్నప్పటికీ.. భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ విషయంలో స్టార్ డైరెక్టర్స్.. రాజమౌళి, కొరటాల శివ, పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి డైరెక్టర్స్ కి బాగా ఒత్తిడికి గురౌతున్నారని తెలుస్తుంది.

 

ప్రస్తుతం ఉన్న ఆంక్షలు ప్రకారం షూటింగ్ సమయంలో వందలాది మంది టెక్నీకల్ సిబ్బంది పాల్గొనకూడదు, మరోపక్క బడ్జెట్ కంట్రోల్ లో ఉండాలి. వీలైతే ముందు అనుకున్నదాని కంటే తగ్గే ప్రయత్నం చేయాలి. ఈ విషయాలతో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక రాజమౌళి దగ్గర నుండి కొరటాల, పూరి, త్రివిక్రమ్ ఇలా చాలామంది దర్శకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లుగా సమాచారం. 

 

షూటింగ్స్‌కి అనుమతులు రావడానికి కాస్త సమయం పట్టినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేసుకోవచ్చని చెప్పింది ప్రభుత్వం. ఇక రాజమౌళి ఎలాగైనా ఆర్.ఆర్.ఆర్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని సన్నాహాలు చేస్తున్నారు. కాని ఆ ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదట. అంతేకాదు కొరటాల శివ ఆచార్య షూటింగ్ విషయం లోను ఇలాంటి పరిస్థితే నెలకొందని తెలుస్తుంది. ఇక పూరి, విజయ్ ఫైటర్ సినిమా విషయంలో ఇప్పటికే కొంత పెట్టుబడి పెట్టాడు.

 

ఇందుకోసం ముంబైలో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు. కాని ముంబైలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పట్లో అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేనేలేదు. ఆచార్య కోసం కొరటాల రెండేళ్లు వెయిట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళి కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండేళ్లుగా కష్టపడుతున్నారు. మొత్తానికి దర్శకులందరు ఒత్తిడితో నిద్ర లేనిరాత్రులు గడపాల్సి వస్తోందట.  ఈ ప్రభావం హీరోల మీద బాగా పడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: