నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వీరి కాంభోలో వచ్చిన సింహ ,లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో ఈమూడో సినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి. ఇటీవలే ఈసినిమా మొదటి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగగా ఆషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ జూన్ లో ప్రారంభం కానుంది. ఇక ఈచిత్రానికి టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రానికి  మోనార్క్ అనే టైటిల్ ను పెట్టనున్నారట. ఈటైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. త్వరలోనే టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదలచేయనున్నారు. 

ఈ చిత్రంలో బాలకృష్ణ డిఫరెంట్ గెటప్ లలో కనిపించనున్నాడు అందులో అఘోరా గెటప్ ఒకటి.. ఆ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ కానుందట. థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్  బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈసినిమా కోసం బాలయ్య కు జోడిగా ఓ కొత్త హీరోయిన్ ను తీసుకున్నారు. ఈఏడాది చివర్లో ఈచిత్రం విడుదలకానుంది. ఇదిలావుంటే గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్ లను చవిచూసిన బాలకృష్ణ, మోనార్క్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
 
సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో బాలయ్య రెండో సారి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరి కథ కూడా సిద్ధం చేశాడట. త్వరలోనే  ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది. ఇంతకుముందు పూరి డైరెక్షన్ లో బాలకృష్ణ, పైసా వసూల్ అనే సినిమా చేయగా ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: