రాజమౌళి ఏక్షణాన్న ‘ఆర్ ఆర్ ఆర్’ మొదలు పెట్టాడో తెలియదు కాని ఈమూవీకి ఆది నుంచే అడ్డంకులు ఎదురౌతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు పెడుతున్న కఠిన నిబంధనల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను ఎలా ప్రారంభించాలో తెలియక సతమైపోతున్న రాజమౌళికి ఇప్పుడు కొత్తగా గత కొద్దిరోజులుగా బాలకృష్ణ నాగబాబుల మధ్య రగిలిన కామెంట్స్ వివాదం రాజమౌళికి టెన్షన్ కలిగిస్తున్నట్లు టాక్.


వాస్తవానికి చిరంజీవి బాలకృష్ణలు వరసపెట్టి సినిమాలు చేస్తున్న కాలం నుండి నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం పరిపాటిగా వస్తూనే ఉంది. చిరంజీవి సినిమాలను వదిలి రాజకీయాల బాటపట్టి మళ్ళీ యూటర్న్ తీసుకున్న పరిస్థితులను నందమూరి అభిమానులు ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు అంతగా సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈమెగా నందమూరి అభిమానుల వార్ నివురుగప్పిన నిప్పులా ఇప్పటి వరకు కొనసాగింది.


దీనికితోడు గత కొంతకాలంగా బాలకృష్ణ చిరంజీవిలు బయట ఫంక్షన్స్ లో కనిపించినప్పుడు నవ్వుతు పలకరించుకోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ కొంతవరకు తాత్కాలికంగా సద్దుబాటు అయింది అని భావించారు అంతా. అయితే ఒకేసారి దావానం లా బాలకృష్ణ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం బాలయ్య కామెంట్స్ పై నాగబాబు ఎదురు దాడి చేయడంతో తిరిగి మళ్ళీ బాలకృష్ణ చిరంజీవిల ఇగో లు తారా స్థాయికి చేరుకున్నాయి.


ఇప్పుడు జరుగుతున్న ఈపరిణామాల పై ఇండస్ట్రీ ప్రముఖులు చాల తెలివిగా స్పందిస్తూ బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఉండదని అంటూ బాలకృష్ణ అనవసరంగా ఖంగారు పడ్డారు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు జరుగుతున్న పరిణామాల పై జూనియర్ కాని కనీసం కళ్యాణ్ రామ్ కాని స్పందించకుండా వ్యూహాత్మక మౌనం వహించడం బాలయ్య అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఈకోపాన్ని అంతా నందమూరి అభిమానులు ‘ఆర్ ఆర్ ఆర్’ పై ఒకవిధంగా చూపిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ జూనియర్ లు కలిసి నటిస్తున్నా వారి అభిమానులు పాత్రలను మాత్రమే చూడాలని ఒకరి పాత్ర ఎక్కువ మరొకరి పాత్ర తక్కువ అన్న యాంగిల్ లో చూడవద్దని ఇప్పటికే రాజమౌళి ఓపెన్ గానే చెప్పాడు. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా ఈమూవీలో అనుకోకుండా చరణ్ జూనియర్ ల పాత్రల మధ్య బ్యాలెన్స్ తప్పితే ఆ కారణాన్ని హైలెట్ చేస్తూ నందమూరి అభిమానులు తమకు వచ్చిన కోపాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రదర్శిస్తూ చేసే నెగిటివ్ ప్రచారం సమస్య ఎదురవ్వకుండా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజమౌళి చాల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: