టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఒకరు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. సినిమాల నిర్మాణ విషయంలో తాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విషయంలో అరవింద్ చాలా ఖచ్చితంగా వ్యహరిస్తూ ఉంటాడు అని అంటారు. అందువల్లనే అయన సక్సస్ ఫుల్ బిజినెస్ మెన్ కాగలిగాడు అన్న అభిప్రాయం కూడ ఉంది.

 

వాస్తవానికి అరవింద్ తన కొడుకు సినిమా అయినా సరే ఎంత పెట్టాలో అంతే పెడుతూ ఆ సినిమా పై ఎంత రాబట్టగలమో అంతే పెట్టుబడిపెట్టాలని అరవింద్ పక్కా వ్యూహాలతో నడుస్తూ ఉంటాడు. అల్లు శిరీష్ ను ఏదో విధంగా హీరోగా సెటిల్ చేయాలి అన్న ఆలోచనలు అరవింద్ కు ఉన్నా ఈ విషయంలో ఎటువంటి ఖంగారు లేకుండా పక్కా వ్యూహాలతో నడవాలి అన్నది అరవింద్ ఎత్తుగడ అని అంటారు.

 

ఇలాంటి పరిస్థితులలో శిరీష్ కు బాగా నచ్చడంతో లేటెస్ట్ గా ఒక తమిళ సినిమా రీమేక్ రైట్స్ ను  అరవింద్ కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం శిరీష్ కు పెద్దగా మార్కెట్ లేని పరిస్థితులలో తన బ్యానర్ వ్యాల్యూ తోడయితే ఎంతవరకు ఈ సినిమాను మార్కెట్ చేయగలం అన్నలెక్కలు అరవింద్ వేస్తున్నట్లు టాక్. ఈ లెక్కలకు అనుగుణంగానే ఈ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ టెక్నికల్ టీమ్ సెట్ చేసే ఆలోచన అరవింద్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

 

అయితే తన సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయంలో మరీ పొదుపు చర్యలు చేపడితే ఔట్ పుట్ బాగుండదు అన్న అభిప్రాయంతో  కాస్త కలర్ ఫుల్ క్రేజీ స్టార్ కాస్ట్ క్వాలిటీ టెక్నికల్ కాస్ట్ ఉండాలని అల్లు శిరీష్ ఆలోచనఅని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే చర్చలు చాలా సీరియస్ గా తండ్రీ కొడకుల మధ్య  నడుస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్. దీనితో అరవింద్ లెక్కల ముందు శిరీష్ సలహాలు కూడ నిల బడటంలేదు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: