టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల సినిమాల్లో నటించి సూపర్ స్టార్ కృష్ణ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో నటించిన కృష్ణ తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. కృష్ణ తన సినీ కెరీర్ లో 340కు పైగా సినిమాల్లో నటించారు. 1970 లో పద్మాలయ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. దర్శకుడిగా కృష్ణ 16 సినిమాలను తెరకెక్కించారు. 
 
ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు నాన్న.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రముఖ దర్శకుడు బీవీఎస్ రవి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. 


 
కృష్ణ కూతురు మంజుల కృష్ణ ఎల్లప్పుడూ తన అభిమాన వ్యక్తి అని... బాల్యం నుంచి ఇంట్లో, సెట్లో, సెలవుల్లో ఆయనను చుశానని... జీవిత పాఠాలు నేర్పించాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదని... ఏదైనా ఉదాహరణలతో చెప్పేవాడని అన్నారు. అలాంటి గొప్ప తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ... ఐ లవ్ యూ నాన్న అని మంజుల ట్వీట్ చేశారు. 


 
హీరో సుధీర్ బాబు కృష్ణ కెరీర్ లో తనకు అత్యంత ఇష్టమైన సన్నివేశం ఇదే అంటూ అల్లూరి సీతారామరాజు సినిమాలోని ఒక సన్నివేశాన్ని షేర్ చేశారు. మరోసారి హ్యాపీ బర్త్ డే మామయ్య అంటూ ట్విట్టర్ పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: