టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రానా దగ్గుబాటి అటు హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా రాణిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండే తన ప్రత్యేకతని చాటుకున్నాడు. సాధారణంగా మొదటి సినిమాగా మంచి మాస్ మసాలా సినిమా చేయాలని అనుకుంటారు. కానీ రానా ప్రయోగాత్మకంగా పొలొటికల్ థ్రిల్లర్ తో వచ్చాడు.

 

ఆ ఒక్క సినిమా సినిమాల్లో అతడేం చేయాలనుకుంటున్నాడో చెప్పేసింది. టాలీవులో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ అందరిలోకి తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న హీరో రానానే అని చెప్పక తప్పదు. బాహుబలిలో భళ్ళాల దేవగా విలనిజాన్ని ప్రదర్శించినా, నేను రాజు నేనే మంత్రి సినిమాలో హీరోగా మరో లెవెల్ కి వెళ్ళినా అంతా సినిమా పట్ల రానాకి ఉన్న అంకితభావమే. అయితే ఈ లాక్డౌన్ టైమ్ లో రానా ఓ శుభవార్తతో మన ముందుకి వచ్చాడు.

 


మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్న రానా సడెన్ గా పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చి అందరినీ షాక్ కి గురి చేసాడు. మిహీకా బజాజ్ అనే అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీనే కాదు అభిమానులని కూడా షాక్ కి గురి చేశాడు. వెడ్డింగ్ ప్లానర్ అయిన మిహీకా బజాజ్ తో రానా ప్రీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. మరొకొన్ని రోజుల్లో రానా వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

 

అయితే పెళ్ళి ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయం కాలేదట. కానీ తాజా సమాచారం ప్రకారం రానా పెళ్ళి ఆగస్టులో ఉంటుందని అంటున్నారు. ఆగస్టు 8వ తేదీన రానా పెళ్ళి ముహూర్తం ఫిక్స్ చేసారని టాక్ వినబడుతోంది. అప్పటి వరకూ కరోనా ఉధృతి తగ్గి పెళ్ళిళ్లకి ప్రభుత్వం నుండి అనుమతులు లభిస్తాయని అనుకుంటున్నారు. సో రానా పెళ్ళి ఆగస్టులో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: