మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. కొరటాల- చిరంజీవి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి వెళ్ళాయి. అయితే దానికి కారణాలు లేకపోలేదు. సామాజిక కథాంశాలతో సినిమాలు తీసే కొరటాల శివ, అలాంటి కథాంశాలున్న సినిమాల్లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న చిరంజీవి కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ మాత్రం హైప్ రావడం యాదృచ్చికమే.

 


ఆచార్య అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా త్రిషని అనుకున్నప్పటికీ క్రియేటివ్ డిఫరెన్సెన్ వల్ల ఆచార్య నుండి తప్పుకుంటున్నట్లు త్రిష ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలోకి కాజల్ ని తీసుకొచ్చారు. మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్న రెండవ చిత్రమిది. ఖైదీ నంబర్ 150 సినిమాలో మెగాస్టార్ పక్కన కనిపించింది. అయితే ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలిసిందే.

 

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర చిరంజీవిని ప్రేరేపించేదిగా ఉంటుందని సమాచారం. అరగంట నిడివి ఉన్న ఈ పాత్రపట్ల అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆ ఎగ్జైటింగ్ ని మరింత పెంచడానికా అన్నట్టు కొరటాల శివ రామ్ చరణ్ కి హీరోయిన్ ని వెతుకుతున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరైతే బాగుంటుందో ఆలోచిస్తున్నాడట.

 

తెలుగు సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న అయితే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారట. ఈ మధ్య రష్మిక మందన్న నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో రష్మిక అయితే రామ్ చరణ్ కి సరైన జోడీ అని భావిస్తున్నారట. మరి ఈ విషయమై అధికారిక సమాచారం వస్తేగానీ క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: