తెలుగు పరిశ్రమలో ఎంతో మంది హీరోలు వచ్చారు పోయారు కానీ ప్రజల చేత దేవుడిలా పూజించబడిన సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టి రామారావు తర్వాత రెండవ స్థానాన్ని కృష్ణ సంపాదించుకున్నారు. తమిళంలో రజనీకాంత్ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకుంటే... తెలుగులో ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. అప్పట్లో సూపర్ స్టార్ బిరుదు ఎవరికి ఇవ్వాలని పోల్ సర్వే అయిదారు సార్లు నిర్వహిస్తే... ఎక్కువమంది కృష్ణ కే ఓట్లు వేశారు. 


అతి తక్కువ కాలంలోనే 345 సినిమాల్లో నటించిన ఘనత కృష్ణ కు దక్కుతుంది. తాను దర్శకత్వం వహించిన సినిమాలు, నిర్మించిన సినిమాలను పక్కన పెడితే తన 345 సినిమాల్లో అనేకమైన పాత్రల్లో అద్భుతంగా నటించి తన కంటే గొప్ప నటుడు ఎవరు ఉండరేమో అనేట్టు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంవత్సరాలు టాలీవుడ్ పరిశ్రమలో 40 సంవత్సరాల పాటు హీరోగా కొనసాగినప్పటికీ... అతను కేవలం 150 పైచిలుకు చిత్రాలు మాత్రమే తీయగలిగాడు. కానీ కృష్ణ మాత్రం కేవలం 20 సంవత్సరాల్లో రెండు వందల సినిమాలలో నటించి తనలో ఎంత సత్తా ఉందొ తెలిపాడు. కృష్ణ తన సినీ జీవితాన్ని 1962వ సంవత్సరంలో ప్రారంభించగా... 1982వ సంవత్సరం నాటికి తాను రెండు వందల చిత్రాల్లో నటించి తెలుగులో తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన హీరోగా పేరుపొందాడు. 20 సంవత్సరాల్లో రెండు వందల సినిమాలు అంటే సంవత్సరానికి పది సినిమాల్లో కృష్ణ నటించినట్టు లెక్క. ఇది నిజంగా ఎవరికీ సాధ్యం కాని అరుదైన అద్భుతమైన ఫీట్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 


కృష్ణ తన సినీ జీవితం మొత్తంలో 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 18 సినిమాలను తానే సొంతంగా నిర్మించాడు. బిపాసా బసు, డినో మోరియా హీరో హీరోయిన్లుగా నటించిన ఇష్క్ హై తుం సే అనే బాలీవుడ్ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తన సినీ కెరీర్లో విజయనిర్మల తో కలిసి 48 సినిమాలు, జయప్రద తో కలిసి 47 సినిమాలు, శ్రీదేవితో కలిసి 30 సినిమాల్లో నటించి తెలుగు పరిశ్రమలో ఒక్క హీరోయిన్ తో ఎక్కువ సినిమాలు తీసిన హీరోగా రికార్డు సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే తాను 25 చిత్రాల్లో (డబుల్ రోల్)ద్వితీయ పాత్రలలో, ఏడు చిత్రాలలో త్రిపుల్ రోల్స్ లలో నటించి భారతదేశ చరిత్రలో ఎవరు సాధించలేని అరుదైన రికార్డును నెలకొల్పాడు. 


తెలుగు ఇండస్ట్రీ కి కౌ బాయ్, జేమ్స్ బాండ్ చిత్రాల ను పరిచయం చేశాడు. విభిన్నమైన కథా నేపథ్యంలో తెరకెక్కిన అతని సాక్షి మూవీ మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ప్రసారం కాబడిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. సింహాసనం అనే సినిమా తెలుగులోనే మొట్ట మొదటి 70MM సినిమా గా పేరొందింది. నా హీరోగా నటించిన ఈనాడు సినిమా ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఫస్ట్ సినిమా స్కోప్ చిత్రమైన అల్లూరి సీతారామరాజు లో కూడా కృష్ణ హీరోగా నటించాడు. తెలుగులో మొట్టమొదటి గా వచ్చిన డిటిఎస్ ఫిలిం తెలుగువీర లేవరా కూడా సూపర్ స్టార్ కృష్ణ తీసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: