తెలుగు పరిశ్రమలో ఎనలేని ఖ్యాతిని, గౌరవాన్ని సంపాదించి పెట్టుకున్న హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు అనగా మే 31 వ తేదీన తన 77వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. సూపర్ స్టార్ అనే బిరుదును పొందినవారిలో కృష్ణ ముందంజలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. అతని బ్రిలియంట్ యాక్టింగ్ నైపుణ్యం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం 1960-80 కాలాలలో గొప్ప నటుడిగా తీర్చిదిద్దాయి. డాన్సు వేయడంలో అతనికి అతనే సాటి అని చెప్పుకోవచ్చు. ఒకసారి అతని డాన్స్ చూస్తే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా మర్చిపోలేడు. అంత గొప్పగా కృష్ణ డ్యాన్స్ వేస్తాడు. డాన్సులు ఫైట్లు గట్రా అద్భుతంగా చేయడం కృష్ణకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 


వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కృష్ణ 1962వ సంవత్సరం లో పదండి ముందుకు అనే పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. తదనంతరం కులగోత్రాలు పరువు ప్రతిష్ట సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించారు. 1965 వ సంవత్సరంలో తేనె మనసులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా సుపరిచితుడు అయ్యాడు కృష్ణ. 66 వ సంవత్సరంలో విడుదలైన కన్నె మనసులు సినిమాలో సోలో హీరోగా కృష్ణ నటించి అందరి మనసులను దోచేశాడు. ఆ తర్వాత అనేకమైన సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో స్థాయికి ఎదిగాడు. 


కొన్నాళ్ల తర్వాత తాను సొంతంగా పద్మాలయ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థని స్థాపించి మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు అగ్ని పరీక్ష లాంటి పడ చిత్రాలను నిర్మించి ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు. అప్పటికే తాను తన కెరియర్లో 350 పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు. ఎంతోమంది సినీ సినీరంగ ప్రవేశం చేసి కృష్ణకు పోటీ ఇవ్వలేకపోయారు. నిజానికి తాను అమెరికన్ జేమ్స్ బాండ్ చిత్రాలను తెలుగు ప్రజలకు అందించి అందరిచేత ప్రశంసలు దక్కించుకున్నారు. గూడచారి 116 లో తన నటనకు గాను విమర్శకులు సైతం కృష్ణ ను తెగ పొగిడేస్తూ తనకి ఎవరూ సాటి రారని కోడై కూసారు. 


1971 వ సంవత్సరం లో తెరకెక్కిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో కృష్ణ కౌబాయ్ పాత్రలో నటించాడు. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్ అంటే ఎవరో, ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఈ సినీ బృందమంతా కలసి ప్రత్యేకమైన రైలు మాట్లాడుకుని రాజస్థాన్ రాష్ట్రంలోని ఎడారులలో, బికనీర్ కోటలో, సట్లెజ్ నది తీరాన, సిమ్లా పరిసర ప్రాంతాల్లోని మంచి కొండలలో పాకిస్తాన్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో మోసగాళ్లకు మోసగాడు సినిమా చిత్రీకరించారు. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా యాభై ఆరు దేశాల్లో రిలీజ్ అయ్యి ఇతర దేశాల్లో ఆడిన మొట్టమొదటి తెలుగు సినిమాగా పేరు సంపాదించింది. అప్పట్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్ద కనువిందు అయ్యిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతవరకు ఘట్టమనేని కృష్ణ ఎవరూ మర్చిపోలేరు. ఈ హ్యాండ్సం హీరో కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: