ఈ తరంలో ప్రయోగాలు చేయడం గొప్ప కాదు. ఈ తరంలో ఏ హీరోయిన్  అయినా హీరో అయినా సరే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దానిలో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. అయితే ఒకప్పుడు ప్రయోగాలు చేసి నిలబడిన వారు మాత్రం సంచలనం అనే చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా చేపుకునేది కృష్ణ... టాలీవుడ్ లో ప్రయోగాలూ అనగానే చాలా మందికి ఆయన పేరే వినపడుతూ ఉంటుంది. అవును ఆయన చేసిన ప్రయోగాలు ఎవరూ కూడా చేయలేదు అనేది వాస్తవ౦. ఇక  ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది అల్లూరి సీతారామ రాజు. 

 

సినిమా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది అని అంటూ ఉంటారు జనాలు. ఆ విధంగా ఆ సినిమా విజయం సాధించింది.ఈ సినిమా కృష్ణ కు తీసుకొచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పటి వరకు అలాంటి పోరాట వీరుల సినిమాలు చెయ్యాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఉండేది అనే మాట అక్షరాలా నిజం. కాని ఆయన ఎక్కడా భయపడకుండా ఆ సినిమాకు తానే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక అది తెలుగులో ఫస్ట్ కలర్ సినిమా.  ఆ సినిమా సాధించిన విజయం చూసిన బాలీవుడ్... 

 

అగ్ర దర్శకులు కొందరు కృష్ణ వద్దకు వచ్చి కొన్ని సలహాను కూడా అడిగే వారు అని చెప్తూ ఉంటారు. తెలుగు సినిమాకు కృష్ణ  సాంకేతిక పరిజ్ఞాన్ని తొలి సారి జోడించారు అని అంటారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన రేంజ్ ఒక రేంజ్ ఓ పెరిగింది అని చెప్తారు. చాలా మంది దర్శక నిర్మాతలు అయితే ఆయన మాదిరి సినిమాలు చేస్తే చాలు అనుకున్నారట. అగ్ర హీరోలకు కూడా ఆ సినిమా ఆదర్శంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: