ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న నటుడిగా ఆరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా కృష్ణ‌ ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఈ క్ర‌మంలోనే న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారీయ‌న‌. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ నేడు 77వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కృష్ణ‌. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. ఇక ప్రస్తుతం ఆయన తనయుడు మహేష్ బాబు..సూపర్ స్టార్ నట వారసత్వాన్ని టాలీవుడ్‌లో కొనసాగిస్తున్నాడు.  

 

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మ‌హేష్‌ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. అయితే ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు కూడా ఎన్నో సినిమాలు క‌లిసి న‌టించారు. మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మొత్తంగా తొమ్మిద‌ సినిమాల్లో కలిసి నటించాడు. అయితే అందులో ఆరు సినిమాలు బాల నటుడిగా తండ్రితో కలిసి న‌టించ‌గా.. మిగిలిన మూడు సినిమాలు హీరో అయ్యాక తండ్రితో న‌టించాడు మ‌హేష్‌.

 

మహేష్ బాబు మొద‌టిసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి న‌టించిన చిత్రం `పోరాటం`.  కోడి రామకృష్ణ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మహేష్ బాబు రెండోసారి కృష్ణతో కలిసి శంఖారావం సినిమాలో నటించాడు. ఈ చిత్రం కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఆ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం మహేష్ ముగ్గురు కొడుకులు. ఈ చిత్రానికి కూడా కృష్ణ స్వీయ దర్శకత్వం వ‌హించ‌గా.. బాక్సాఫిస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

 

ఇక ఆ త‌ర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన `గూఢచారి 117`సినిమాలో మ‌హేష్‌, కృష్ణ మ‌రోసారి క‌లిసినంచారు. ఈ చిత్రం కూడా సూప‌ర్ హిట్‌గానే నిలిచింది. అలాగే ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ కృష్ణ‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌ల‌యిక‌లో కొడుకు దిద్దిన కాపురం, అన్నాతమ్ముడు, రాజ కుమారుడు, వంశీ, టక్కరి దొంగ వంటి సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. టక్కరి దొంగ సినిమా తర్వాత వీరిద్ద‌రూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: