సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తన సత్తా చూపించారు కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఆయన సంచలనం సృష్టించారు. ఆయన సినిమాలు ఆయనకు ఏ విధంగా పేరు తీసుకోచ్చాయో ఆయన నటన తో పాటుగా ఆయన రాజకీయం కూడా అదే స్థాయిలో పేరు తీసుకొచ్చింది. తీసుకున్న ఏ బాధ్యత అయినా సరే ఆయన సమర్ధవంతంగా పోషించి తన మార్క్ ని వేసారు. ఇక ఆయన  ఏలూరు ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. వాస్తవానికి ఆయనది తెనాలి... గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం. 

 

అయినా సరే ఆయన మాత్రం సమర్ధవంతంగా పని చేసి ఎన్నికల్లో విజయం సాధించారు ఏలూరు నుంచి. ఇక ఆయనకు ఎంపీ గా మంచి పేరు వచ్చింది అనే చెప్పుకోవచ్చు. ఆయనకు పార్లమెంట్ లో కూడా మంచి విలువ ఉండేది. ఆయన సినిమాలను ఏ విధంగా ఆదరించారో ఆయన రాజకీయాలను కూడా అదే విధంగా ఆదరించారు అని చెప్పవచ్చు. ఏలూరు ప్రజలకు ఆయన తన వంతుగా ఏది అందించాలో అది అందించారు. ఇక ఆయన రాజకీయాల్లో వివాదాలు కూడా అప్పుడప్పుడు కనిపించాయి. తనను కాంగ్రెస్ తో కలిసి కృష్ణ ఇబ్బంది పెట్టాలి అని చూసారని ఎన్టీఆర్ కూడా భావించారు. 

 

అయితే కృష్ణ మాత్రం వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేసారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఆయన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసారు. ఆయన ఏలూరు ఎంపీ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. కార్యకర్తలకు కూడా ఆయన ఎక్కువగా అండగా ఉండేవారు అని అంటారు. ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వచ్చినా సరే ఆయన వారితో అన్ని విషయాలు మాట్లాడటమే కాకుండా ఎంత బిజీ గా ఉన్నా సరే నియోజకవర్గ పర్యటనకు వెళ్ళే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: