తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయస్సు దాటి పోతున్నప్పటికీ ఇంకా కుర్రోడి లాగే కనిపిస్తూ అమ్మాయిల మనసులు  దోచుకుంటూ ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మామూలుగానే మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు హీరోల కంటే  గొప్ప అందగాడు అని చెప్పాలి. అందుకే అమ్మాయిలందరూ మహేష్ జపం చేస్తూ ఉంటారు. ఒక్క చూపుతోనే అమ్మాయిల మనసులు  కొల్ల కొట్టగలడు హీరో మహేష్ బాబు. మామూలుగానే అందగాడైన మహేష్ బాబు... మరింత పెరిగి పోతే ఇక ప్రేక్షకులు అమ్మాయిల పరిస్థితి ఏంటి..?  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అదే జరుగుతోంది. 

 

 ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అన్ని  నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరదాగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు . కామెడీతో సమయం గడుపుతున్నా అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే మామూలుగానే గొప్ప అందగాడైన మహేష్ బాబు ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో మరి ఇంకా  ఎక్కువ అందగాడిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక లాక్ డౌన్  సమయంలో మహేష్ బాబు సెల్ఫీ లతో అమ్మాయి మనసులు  దోచుకుంటున్నాడు. 

 

 ప్రతి సెల్ఫీలో  అంతకంతకు అందంగా కనిపిస్తున్నారు మహేష్ బాబు. తన కొడుకు గౌతమ్ పక్కన నిలుచుంటే గౌతమ్కి మహేష్ బాబు తండ్రి కాదు అన్నయ్య అవుతాడేమో అనేంతలా అందంగా మారిపోయాడు మహేష్ బాబు. అమ్మాయిల మనస్సులను దోచుకుంటున్నాడు. నాలుగు పదుల వయస్సు దాటి పోతున్నప్పటికీ ఇంకా యువకుడిలా... కాదు కాదు చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. ఈ లాక్ డౌన్  సమయంలో ఇంట్లో సెల్ఫీ లతో మాత్రం అందరికీ షాక్ ఇస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: