అప్పుడెప్పుడో అతిథిలో లాంగ్ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆతరువాత  డజను సినిమాలు చేసిన లుక్ లో మాత్రం పెద్దగా తేడా రాలేదు. ఇక ఎట్టకేలకు మరోసారి లాంగ్ హెయిర్ తో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు మహేష్. చెవికి పోగు ,మెడ పై టాటూ కూడా దర్శనమివ్వనున్నాయి. ఈ లుక్ అంతా తన 27వ చిత్రం కోసమే. గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో మహేష్ ,సర్కారు వారి పాట అనే సినిమా చేయనున్నాడు. 
 
కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఈసినిమా టైటిల్ పోస్టర్ ను విడుదలచేశారు దాంతో ఈపోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా ను ఊపేస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రానికి  థమన్ సంగీతం అందించనున్నాడు. పీఎస్ వినోద్  కెమెరామెన్.. మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్  ప్లస్, జిఎంబి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనుండగా  జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయాల్సివుంది. భారీ అంచనాల మధ్య ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. మరి హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ల తో ఫుల్ ఫామ్ లో వున్న మహేష్ , సర్కారు వారి పాటు తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: