పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల ప్రాజెక్టులకు అంగీకరించి వకీల్ సాబ్ చిత్ర షూటింగు ను 80 శాతం పూర్తి చేశాడు. దాదాపు 30 రోజుల పాటు నటిస్తే ఆ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. చిత్రీకరణ పూర్తయిన వెంటనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొక సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనుండగా... ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే మొగలాయిల కాలం యొక్క కథతో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. 


వాస్తవానికి పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో కేవలం ఒకే ఒక్క సినిమాలో డబుల్ రోల్ లో నటించాడు. ఆ సినిమా అందరికీ తెలిసిన తీన్మార్ కాగా... అది అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఏదిఏమైనా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా చిత్రంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా... పవన్ కళ్యాణ్ అనేకమైన కొత్త కళలను నేర్చుకుంటున్నాడు. తన పాత్రకు న్యాయం చేసే విధంగా కత్తిసాము గుర్రపు స్వారీ లాంటి కళలలో నైపుణ్యం తెచ్చుకుంటున్నాడు. ఈ చిత్రంలో కోహినూర్ డైమండ్ సన్నివేశం హైలెట్ అని విరూపాక్ష సినీ బృందం వెల్లడించింది. ఈ సన్నివేశంలో పవన్కళ్యాణ్ తుపాకీతో విన్యాసాలు చేయాల్సి ఉంటుందట. ఇందుకోసం పవన్ ప్రస్తుతం తుపాకీ పట్టుకోని విన్యాసాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు అట. 


రాజకీయ రంగంలో అడుగు పెట్టి రేయింబవళ్ళు ప్రజా సమస్యల తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కష్టపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం సినిమాల్లో కష్టపడాల్సిన సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చు. విరూపాక్ష సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ కొన్ని రియలిస్టిక్ స్టంట్స్ చేయడానికి పెద్ద రిస్కు చేస్తున్నాడని... ఏదైనా అటు ఇటు అయితే తనకి ప్రమాదం పెరిగే అవకాశాలు ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: