ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా విడుదల చెయ్యాలి అంటే చాలు ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి. ఎక్కడ సినిమా ఫ్లాప్ అవుతుందో అనే భయం జనాలకు ఎక్కువగా ఉంది. ఫ్లాప్ అయితే తమను ఎవరూ పట్టించుకునే అవకాశం కూడా ఉండదు అనేది చాలా మంది భావన. అలాంటిది టాలీవుడ్ లో ఏడాదికి ఒక్కో హీరో పదుల సినిమాలను విడుదల చేసి సంచలనం సృష్టించే వారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఇదే విధంగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అనేది చాలా మందికి తెలిసిన విషయం. 

 

ఇక అప్పటి హీరోలు ఏదైనా ప్రయోగం చెయ్యాలి అంటే భయపడే సందర్భం ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా కృష్ణ విషయానికి వస్తే ఆయన ప్రతీ ఏటా వరుసగా సినిమాలు చేసారు. ఏ హీరో కూడా చేయలేని విధంగా ప్రతీ ఏటా పదుల సినిమాలను ఆయన విడుదల చేసిన రోజులు ఉన్నాయి. ఇక ఒకే నెలలో 7 సినిమాలను విడుదల చేసి ఆయన సంచలనం సృష్టించారు అప్పట్లో అనేది వాస్తవం ఇక ఆయన సినిమాల మీద ప్రేక్షకులకు బోర్ కొట్టింది అనే ఆరోపణలు వచ్చినా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గే వారు కాదు. ఆయన సినిమా ఎప్పుడు కూడా ఒకటి ఆడుతూ ఉండేది. 

 

దీనితో బాలీవుడ్ జనాలు కూడా కృష్ణ దూకుడు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పవచ్చు. ఆ విధంగా కృష్ణ తన మార్క్ ని వేసుకున్నారు అనే చెప్పాలి. ఒక నెలలో 7 సినిమాలను విడుదల చేయడం అనేది నిజం గా సంచలనం అనే చెప్పాలి. ఆయన కుమారుడు మహేష్ బాబు అయితే రెండేళ్లకు ఒక సినిమా  విడుదల చేయడం కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: