ఈ మే 9 వ తారీకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా రిలీజ్ అయి 30 సంవత్సరాలు అయింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 30 సంవత్సరాలు కావడంతో సోషల్ మీడియాలో  సినిమాకి సంబంధించి హిడెన్ స్టోరీస్ తో అనేక విషయాలను తెలియజేస్తూ ప్రేక్షకులు షాక్ అయిపోయే నిజాలు అశ్వనీదత్ బయటపెట్టారు. అప్పట్లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అదే సమయంలో పాటలు ముందే సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. 

IHG

వాతావరణం అంత పాజిటివ్ గా ఉంది, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్న టైంలో ఆరో తారీకు నుండి తుఫాన్ వార్తలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. దీంతో తుఫాన్ వాతావరణం అధికమవడంతో సినిమా ప్రింట్ ఎలా పంపించాలో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. కరెంటు కష్టాలు కూడా ఎదురయ్యాయని తెలిపారు. కానీ రిలీజ్ ఆగకూడదని ఎలాగోలాగా ప్రింట్స్ పంపించినట్లు తెలిపారు. 9-5-1990 సినిమా విడుదలైన సినిమా థియేటర్లలో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాగాని ప్రేక్షకులు సినిమాని ఆదరించారని తెలిపారు. మొదటి రెండు రోజులు తుఫాన్ వల్ల ఫర్వాలేదనిపించినా మూడో రోజు నుండి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుందని అశ్విని గారు తెలిపారు.

IHG

అదే సమయంలో ఎన్టీ రామారావు రాజకీయాలలో ఉన్న తరుణంలో ఆయన దగ్గరకు పిలిచి సినిమా అదిరిపోయింది. నువ్వు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు అని అన్నారని అప్పుడు చాల ధైర్యం అనిపించందని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా పాటల విషయంలో సంగీతం అందించిన  ఇళయరాజా పాటలు మొదట అన్ని క్లాసికల్ గా ఉండగా చిరంజీవి శ్రీదేవి కావటంతో మాస్ సాంగ్ అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పగా వెంటనే 'అబ్బనీ తీయని దెబ్బ' అనే క్లాస్ సాంగ్ ని కొద్ది నిమిషాల వ్యవధిలోనే మాస్ సాంగ్ గా మార్చారు అని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ఇటీవల తెలిపారు. సాంగ్స్ షూటింగ్ టైంలో హై ఫీవర్ ఉన్న చిరంజీవి షూటింగ్ ఎక్కడ మాట్లాడలేదని అన్నారు. సినిమా కోసం అంత డేడికేషన్ చిరంజీవి పని చేస్తారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: