అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన బంగారుబాబు సినిమాలో చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది..’ పాట ఆల్ టైమ్ క్లాసికల్ హిట్. ఆ పాటలో వాణిశ్రీ అందానికి చీర రంగు కూడా అంతే అందం తీసుకొచ్చింది. అమ్మాయిలకు బ్రాండ్ సింబల్ గా అప్పట్లో ఆపాట, వాణిశ్రీ, ఆ చీర నిలిచిపోయాయి. ఇప్పుడదే రంగు చీరకట్టులో తళుక్కున మెరుస్తోంది ప్రణీత. ఈ జనరేషన్ లో చెంగాబి రంగు చీరకు నా అందమే సరైనది అని చెప్తుందో.. నా అందానికి చెంగాబి రంగే సరైనది అని చెప్తుందో కానీ ప్రణీత అందమైన లంగా ఓణి చీరకట్టులో మెరిసిపోతోంది.  

IHG

 

చెంగాబి రంగు చీరలో తన సోయగాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రణీత అందాన్ని ఈ చీర మరింత హైలైట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ప్రణీత సొగసును తెగ పొగిడేస్తున్నారు. ప్రణీత మనసే కాదు.. మనిషి కూడా ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.  ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. గ్లామర్ డ్రెస్సుల్లో ప్రణీత మోడ్రన్ గా ఉంటుందని చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నిండుగా సంప్రదాయ దుస్తుల్లో కూడా ఎంత అందంగా ఉంటుందో ప్రూవ్ చేస్తోంది ఈ బెంగళూరు బ్యూటీ.

Image

 

ఇటివల కరోనా సమయంలో ఏ హీరోయిన్ చేయలేనటువంటి చారిటీ చేసి ప్రజల మన్ననలు అందుకుంది. ఆమె సామాజిక సేవకు దేశవ్యాప్త గుర్తింపు కూడా వచ్చింది. తెలుగులో పలు సినిమాలు చేసి తన గ్లామర్ తో ఆకట్టుకుంది ప్రణీత. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ తో రభస సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన హంగామా2 లో నటిస్తోంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: